నేడే కర్ణాటక కొత్త సీఎం ఎంపిక: ఇవాళ రాత్రి బీజేపీఎల్పీ భేటీ

By narsimha lodeFirst Published Jul 27, 2021, 2:07 PM IST
Highlights

బీజేపీ శాసనసభపక్ష సమావేశం మంగళవారం నాడు రాత్రి ఏడున్నర గంటలకు బెంగుళూరులోని ఓ హోటల్‌లో జరగనుంది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ లు హాజరుకానున్నారు. కొత్త సీఎం ఎంపిక విషయమై ఎమ్మెల్యేలతో పార్టీ కేంద్రమంత్రులు చర్చించనున్నారు.

బెంగుళూరు: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం బీజేపీ శాసనసభపక్షం  మంగళవారం నాడు సాయంత్రం సమావేశం కానుంది. ఇద్దరు కేంద్ర మంత్రులు ధర్మేంద్రప్రధాన్, కిషన్ రెడ్డిలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.బెంగుళూరులోని కేపిటల్ హోటల్‌లో బీజేపీ శాసనసభపక్ష సమావేశం నిర్వహిస్తారు. కర్ణాటక సీఎం ఎంపిక కోసం ఇవాళ తాను బెంగుళూరు వెళ్తున్నానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం నాడు మీడియాకు తెలిపారు.

also read:కర్ణాటకకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్‌: కొత్త సీఎం ఎంపికకు ఎమ్మెల్యేలతో భేటీ

బీజేపీ శాసభపక్ష సమావేశం తర్వాత కొత్త సీఎం ఎంపిక జరుగుతుందని కిషన్ రెడ్డి ఇవాళ తెలిపారు.బీజేపీ శాసనసభపక్ష సమావేశం కొత్త సీఎం ఎంపికకు వేదికగా మారనుంది.రెండేళ్ల తర్వాత కర్ణాటక సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేశారు. దీంతో కొత్త సీఎం ఎంపిక అనివార్యంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది కర్ణాటక రాష్ట్రంలోనే. అయితే ఆయన ఏనాడూ కూడ పూర్తి కాలం పాటు సీఎంగా కొనసాగలేదు.

బీజేపీ శాసనసభపక్ష సమావేశానికి పరిశీలకులను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తారు. ఎమ్మెల్యేగా లేని అభ్యర్ధిని సీఎం అభ్యర్ధిగా ఎంపిక చేయాల్సిన పరిస్థితులు నెలకొంటే ఈ సమావేశానికి అతడిని కూడ ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు.  బీజేపీ శాసనసభపక్ష సమావేశంలో 120 మంది ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ సమావేశంలో మాజీ సీఎం యడియూరప్ప కూడ పాల్గొంటారు.బీజేపీ శాసనసభపక్షం తమ నేతను ఎన్నుకొన్న తర్వాత ఈ విషయాన్ని గవర్నర్ కు తెలుపుతారు. బీజేపీఎల్పీ నేతగా ఎన్నికైన వ్యక్తిని సీఎంగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానిస్తారు. గురువారంనాటికి కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని సమాచారం.

click me!