భార్యతో గొడవ.. కొండపైనుండి తోసేసి హత్య.. సేల్స్ మెన్ అరెస్ట్...

Published : Jul 27, 2021, 01:28 PM IST
భార్యతో గొడవ.. కొండపైనుండి తోసేసి హత్య.. సేల్స్ మెన్ అరెస్ట్...

సారాంశం

నిరుడు జూన్ లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి, తన మీద అత్యాచారం చేశాడని 29 ఏళ్ల బబిత అనే మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

న్యూ ఢిల్లీ: గత నెలలో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో తన భార్యను కొండపై నుంచి తోసేసిన కేసులో 24 ఏళ్ల సేల్స్‌మన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.

నిరుడు జూన్ లో ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి, తన మీద అత్యాచారం చేశాడని 29 ఏళ్ల బబిత అనే మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు రాజేష్ రాయ్‌ను నిరుడు ఆగస్టులో అరెస్టు చేశారు.

రాజేష్ రాయ్ ఆ తరువాత అక్టోబర్ లో ఢిల్లీ తీహార్ జైలు నుండి విడుదలయ్యాడు. అతను విడుదలయ్యాక ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే అతను ఆమెను శారీరకంగా వేధించేవాడని, తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడని ఆ మహిళ కుటుంబం ఆరోపించింది. 

ఈ వేధింపులు తట్టుకోలేక మహిళ పుట్టింటికి వెడితే.. రాయ్ ఆమెను తన వద్దకు తిరిగి రావాలని బలిలాడి ఒప్పించాడు. చివరికి జూన్ 11 న రాయ్, బబితను ఉత్తరాఖండ్ లోని ఉధామ్ సింగ్ నగర్ జిల్లాలోని తన గ్రామానికి తీసుకెళ్లాడు. ఆ తరువాత, బబిత  ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో ఢిల్లీలోని తన కుటుంబాన్ని ఆందోళనకు గురిచేసింది.

కుటుంబం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు ఆమె భర్తను గుర్తించి అరెస్టు చేశారు. ప్రశ్నించినప్పుడు, అతను తన భార్యతో గొడవ తర్వాత నైనిటాల్ వద్దకు తీసుకెళ్ళి ఆమెను ఒక కొండపై నుండి నెట్టివేసినట్లు ఒప్పుకున్నాడు.

PREV
click me!

Recommended Stories

CPI-CPM Joint Press Conference: విజయ్ కు వామపక్షాల మద్దతుసీఎం కుర్చీ ఎక్కనున్న తలపతి| Asianet Telugu
Thalapathy Vijay CM: విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం.. స్వీట్లు పంచి సంబరాల్లో ఫ్యాన్స్| Asianet Telugu