కమిషనర్ ఇంటి ముందు చెత్త కుమ్మరించిన ఎమ్మెల్యే..

Published : Jul 27, 2021, 01:59 PM IST
కమిషనర్ ఇంటి ముందు చెత్త కుమ్మరించిన ఎమ్మెల్యే..

సారాంశం

ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఒక ట్రాక్టర్ నిండా చెత్త నింపుకుని స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ ఏకంగా బెళగావి నగర పాలికె కమీషనర్ కె. హెచ్.జగదీష్ నివాసం ముందు కుమ్మరించారు. 

బెళగావి జిల్లాలోని బెళగావి దక్షిణ శాసనసభా నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తుండడంతో స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆదివారం ఉదయం ఎమ్మెల్యే అభయ్ పాటిల్ ఒక ట్రాక్టర్ నిండా చెత్త నింపుకుని స్వయంగా తానే డ్రైవ్ చేస్తూ ఏకంగా బెళగావి నగర పాలికె కమీషనర్ కె. హెచ్.జగదీష్ నివాసం ముందు కుమ్మరించారు. 

పాలికె ఉన్నతాధికారులకు పరిస్థితి తీవ్రత గురించి తెలియ జెప్పేందుకే తాను ఇలా వినూత్న రీతిలో  నిరసన చేపట్టినట్లు ఆయన మీడియకు చెప్పారు. ప్రజల కోసమే తాను ఈ పనిచేశానంటూ గట్టిగా సమర్ధించుకున్నారు. 

కాగా, ఎమ్మెల్యే తీరుమీద నెటిజన్లు తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తన నిరసనను మరో విధంగా తెలియజేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పాలికె సిబ్బంది కూడా ఎమ్మెల్యే అభయ్ పాటిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu