కొత్తగా పెళ్లైన ఓ జంట తమ శోభనం వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు దీనిమీద మండిపడుతున్నారు.
సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి తర్వాత.. లైక్ లు, షేర్లు, కామెంట్లే జీవితమైపోయింది. వీటికోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. దానికి తగ్గట్టుగానే ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో.. ఎవరిని సెలబ్రిటీలు గా మారుస్తుందో తెలియడం లేదు. చూసినవారు ఇందులో ఏముంది ఇంత వైరల్ కావడానికి అనుకున్నా సరే.. కంటెంట్ లేని చాలా వీడియోలు.. అలా వైరల్ అవుతున్న జాబితాలోకి చేరుతున్నాయి. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే.. ఓ జంట ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఓ వీడియో మీద నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు.
లైకుల కోసం ఇంతగా దిగజారాలా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. నాలుగు గోడల మధ్య రహస్యంగా.. భార్యాభర్తలకు మాత్రమే ఆనందాన్ని ఇవ్వాల్సిన.. విషయాన్ని కొన్ని లైకుల కోసం సోషల్ మీడియాకు ఎక్కించారంటూ మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే… ఓ జంట తమ ఫస్ట్ నైట్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో భార్యాభర్తలిద్దరూ.. శోభనం గదిలో వధూవరుల ఆహార్యంలో కనిపిస్తారు.
undefined
బ్రేకింగ్ : సిక్కింలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.3గా నమోదు..
కెమెరా ముందు ముద్దులతో రెచ్చిపోయి.. హగ్గులతో హాటెక్కిస్తూ రొమాన్స్ చేశారు. ఆ తరువాత వధువు ఆభరణాలు, అలంకరణ తీయడంతో వరుడు సాయం చేశాడు. చివరికి ఆమె దుస్తులు తీయబోతుండడంతో వీడియో పూర్తవుతుంది. ‘నిద్రమత్తులో ఉన్న నా భర్త శోభనం రోజు నాకెలా సాయం చేశాడో చూడండి..’ అంటూ ఆమె వీడియోకు కామెంట్ కూడా రాసింది.
దీనిమీదే నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. చివరికి దీన్ని కూడా వదల్లేదా.. మీ పిచ్చి తగలెయ్యా.. అని ఒకరంటే.. ఇలాగే ఊరుకుంటే ఫోర్న్ వీడియోలు కూడా షేర్ చేసేలా ఉన్నారంటూ మరికొంతమంది మండిపడుతున్నారు. ఈ వీడియోకు వారు ‘మా శోభనం రాత్రి మెమెలా గడిపామంటే.. ’అంటూ పెట్టడం అందరికీ మంట పుట్టిస్తోంది.
నాలుగు గోడల మధ్య జరగాల్సింది.. నడిబజార్లోకి తెచ్చారంటూ సీరియస్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఏది పెట్టాలో.. ఏది పెట్టకూడదో.. తెలియదు నేటి యువతకు అంటూ విరుచుకుపడుతున్నారు. అయితే, ఇదంతా వీరు లైకుల కోసం చేస్తే.. దాన్ని వారి సాధించారు. కానీ దాంతో పాటు ఈ తీట్లదీవెనలు భోనస్ అన్నట్టు.