వాట్సాప్‌ కాల్‌ ద్వారా డెలివరీ చేసిన వైద్యురాలు.. తల్లి బిడ్డ క్షేమం..

By Rajesh Karampoori  |  First Published Feb 13, 2023, 7:12 AM IST

జమ్ముకశ్మీర్‌లోని ఓ మారుమూల ప్రాంతాల్లోని  ఉన్న మహిళ ప్రసవ వేదనతో అల్లాడుతోంది.  హిమపాతం కారణంగా ఆ ప్రాంతానికి అధునాతనమైన వైద్య సదుపాయాలు వెళ్లే పరిస్థితులు లేదు.  పీహెచ్‌సీలోని మెడికల్ స్టాఫ్‌కు ఏం చేయాలో పాలుపోలేదు. ఈ సమయంలో ఓ వైద్యురాలు  వాట్సాప్‌ కాల్‌ ద్వారా..  సలహాలు, సూచనలు ఇస్తూ డెలివరీ చేయించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యం ఉన్నారు. 


సాధారణంగా మనం వాట్సాప్ ను ఎందుకు ఉపయోగిస్తాం.. సరదాగా స్నేహితులతో ఛాటింగ్ చేయడం కోసమో.. అదే స్నేహితులతో వీడియో కాల్ మాట్లాడటం కోసమో ఉపయోగిస్తాం కాదా..  కానీ, ఓ వైద్యురాలు ఓ నిండు ప్రాణాన్ని కాపాడింది. పసి బిడ్డకు పురుడుపోసింది. అది జమ్ముకాశ్మీర్.. ముందే శీతకాలం.. గత కొన్ని రోజులుగా విపరీతమైన మంచు కురుస్తోంది. పలు చోట్ల మంచు చరియలు విరిగిపడి.. దారులు మూసుకపోయాయి. పట్టణ ప్రాంతంలోనే ఇలా ఉంటే.. మారుమూల ప్రాంతంలో ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఇలాంటి పరిస్థితుల నడుమ ఓ మహిళ ప్రసవ వేదన పడుతూ.. కేరాన్ గ్రామంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రానికి వచ్చింది. ఈ క్లిష్ట పరిస్థితిల్లో ఆమెకు డెలవరీ చేయడానికి అక్కడికి వైద్యులు రాలేని పరిస్థితి. సమయం గడుస్తున్న కొద్దీ.. ఆమె పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ప్రసవ వేదనతో ఆ గర్భిణీ అల్లాడుతోంది. ఆస్ప్రతికి తరలించాలంటే.. హెలికాప్టర్ కావాల్సిందే.. కానీ, మంచు తీవ్రంగా కురుస్తుండటంతో.. హెలికాప్టర్ ల్యాండింగ్ సాధ్యం కాదని అధికారులు చేతులెత్తేశారు. వేరే ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పారు. 

Latest Videos

undefined

ఏం చేయాలో అర్థం కాక కుటుంబ సభ్యులు, స్థానిక వైద్యులు ఆందోళన పడుతుండగా.. ఓ వైద్యురాలికి ఓ మెరుపు ఆలోచన వచ్చింది.  క్రాల్‌పొరలోని సబ్‌డిస్ట్రిక్ హాస్పిటల్‌లో పని చేసే గైనకాలజిస్ట్ హీహెచ్‌సీలోని వైద్యులకు వాట్సాప్ కాల్ చేసి.. ఎలా ప్రసవం చేయాలో.. సురక్షితంగా బిడ్డను ఎలా బయటకు తీయాలో స్థానిక వైద్యులకు గైడ్ చేశారు. ప్రతి విషయాన్ని క్షుణంగా వివరించారు. దీంతో పిహెచ్ సీ సిబ్బందికి డెలవరీ చేయగలమనే భరోసా వచ్చింది. ఫైనల్ గా సీనియర్ డాక్టర్ చెప్పినట్టుగా.. పిహెచ్ సీ సిబ్బంది సుఖ ప్రసవం చేశారు.

ఆ మహిళ పండంటి ఆడ శిశువు జన్మించింది. ఇలా వాట్సాప్‌ కాల్‌ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ డెలివరీ చేయించారు.ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ ఘటనపై క్రాల్‌పోరా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మీర్ మహ్మద్ షఫీ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ప్రసవ వేదనతో అల్లాడుతున్న గర్భిణీని తాము ఆదుకున్నామని తెలిపారు. సుమారు ఆరు గంటల పాటు వైద్యులు శ్రమించిన తర్వాత.. ఆ మహిళ ఓ ఆడశిశువుకు జన్మనిచ్చిందనీ, ప్రస్తుతం తల్లి, పిల్ల ఇద్దరూ పరిశీలనలో ఉన్నారని, వారిద్దరూ  ఆరోగ్యంగానే ఉన్నట్లు డాక్టర్‌ షఫీ వెల్లడించారు. 

click me!