పెళ్లి కూతురి సిగ్గు.. కరోనా టెస్టుకి ముసుగు తీయకుండా..!

By telugu news teamFirst Published May 19, 2021, 9:27 AM IST
Highlights

ఈ పరీక్ష చేయించుకోవడానికి ఓ కొత్త పెళ్లి కూతురు అధికారులను ముప్పుతిప్పలు పెట్టి.. మూడుచెరువుల నీళ్లు తాగించింది. 

ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలో ఎంతలా విలయతాండవం చేస్తోందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారి సోకిందో లేదో తెలియాలంటే.. కరోనా పరీక్ష చేయించుకోవాల్సిందే. ఈ పరీక్ష ఎలా చేస్తారో కూడా అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. ముక్కు లేదా గొంతులో.. చెక్ చేస్తారు. అయితే.. ఈ పరీక్ష చేయించుకోవడానికి ఓ కొత్త పెళ్లి కూతురు అధికారులను ముప్పుతిప్పలు పెట్టి.. మూడుచెరువుల నీళ్లు తాగించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లా షాహ్ నగర్ సరౌలా గ్రామంలో మంగళవారం అధికారులు కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించడానికి వచ్చారు. ఈ సమయంలో 37 మందికి పరీక్షలు నిర్వహించి మరికొందరికి చేస్తున్నారు. ఈ సమయంలో కొత్తగా పెళ్లయిన అమ్మాయి వచ్చింది. పరీక్ష చేయించుకునేందుకు సిగుపడింది. తలపై కొంగుతోనే అధికారుల వద్దకు వచ్చింది. 

కరోనా పరీక్ష చేసేందుకు ఆమెను కొంగు తీసేయమని అధికారులు అడిగారు. అయితే ఆమె సిగ్గుతో అలానే ఉండిపోయింది. దీంతో పక్కనున్న వారిని బయటకు వెళ్లమని అడిగారు. కొంగు తీసేందుకు నిరాకరించడంతో అక్కడ ఉన్న పురుషులను దూరంగా వెళ్లమని చెప్పారు. దీంతో గ్రామస్తులు వైద్య అధికారులపై దాడి చేశారు. వీరి దాడిలో ఇద్దరు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!