కేజ్రీవాల్ పెద్ద మనసు: 10 కిలోల బియ్యం, కరోనా మృతులకు 50 వేలు ఆర్ధిక సాయం

By Siva KodatiFirst Published May 18, 2021, 11:31 PM IST
Highlights

దేశంలో కరోనా మూడోదశ వ్యాప్తి తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి కీలక సూచనలు చేశారు. సింగపూర్ వేరియెంట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన హెచ్చరించారు

దేశంలో కరోనా మూడోదశ వ్యాప్తి తప్పదంటూ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోడీకి కీలక సూచనలు చేశారు. సింగపూర్ వేరియెంట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని ఆయన హెచ్చరించారు.

సింగపూర్ స్ట్రెయిన్ చిన్నారులకు ప్రాణాంతకం కావొచ్చని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. సింగపూర్ స్ట్రెయిన్ భారత్‌కు విస్తరించే అవకాశం వుందని అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు. సింగపూర్ నుంచి విమాన రాకపోకలు రద్దు చేయాలని సీఎం కోరారు.

Also Read:ఫోన్ చేస్తే చాలు... ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ హోం డెలివరీ: కేజ్రీవాల్ వినూత్న ప్రయోగం

చిన్నారులకు తక్షణం వ్యాక్సినేషన్ ఇచ్చే అంశం పరిశీలించాలని కేజ్రీవాల్ సూచించారు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపే అవకాశం వుందవని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డు ఉన్నవారందరికీ 10 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. కోవిడ్‌తో చనిపోయిన కుటుంబాలకు రూ.50 వేలు ఆర్ధిక సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన కుటుంబాలకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు ఉచిత విద్య అందజేస్తామని సీఎం వెల్లడించారు. 

click me!