ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానంలో పైలెట్ పై దాడి ఘటనలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ఆలస్యంగా బయలు దేరే విషయంలో ఆలస్యం గురించి ప్రకటన చేసే సమయంలో ఓ ప్రయాణీకుడు పైలెట్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయమై విమానంలోని ఓ ప్రయాణీకుడు సోషల్ మీడియాలో తన వెర్షన్ ను పోస్టు చేయడంతో సంఘటన మరో మలుపు తిరిగింది. ఈ విమానంలో ప్రయాణీస్తున్న రష్యన్ -భారత నటి మోడల్ ఎవ్జెనియా బెల్స్‌కియా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు.
Video 1- pilot assaulted by passenger after 13-hour flight delay
Passenger has been identified as Sahil Kataria. The airlines has filed a complaint against him
Video 2- After the incident, passenger was taken out & and handed over to the DGCA authorities and police pic.twitter.com/thKl4jg9oE
आख़िर साहिल ने के पायलट को क्यों मारा। इसका जवाब उसी प्लेन में बैठी पैसेंजर ने दिया।
10 घंटे की देरी के बाद प्लेन में बैठाया और उसमें भी दो घंटे बैठाये रखा। इसके बाद पायलट ने देरी के लिये पैसेंजर को ही दोषी ठहराना शुरू किया जिसकी वजह से आरोपी गुस्सा हुआ और पायलट को… https://t.co/PXCmmIPKwy pic.twitter.com/ehTru29EdM
ఢిల్లీ- గోవా విమానం (6ఈ-2175) ఆదివారంనాడు ఉదయం ఏడున్నర గంటలకు టేకాఫ్ కావాల్సి ఉంది. అయితే ఉదయం ఆరు గంటలకే విమానాశ్రాయానికి చేరుకున్నామని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. విమానం ఆలస్యమైందన్నారు. దాదాపు 10 గంటలు ఎదురు చూసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత విమానంలోకి వెళ్లినట్టుగా తెలిపారు. విమానంలో కూర్చున్న తర్వాత కూడ రెండు నుండి మూడు గంటల పాటు వెయిట్ చేసినట్టుగా ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు.
వీడియో మరింత ఆలస్యమైన విషయమై ప్రయాణీకులు పూర్తిగా సహనం కోల్పోయారన్నారు. ఈ విషయమై ప్రయాణీకులు క్యాబిన్ సిబ్బందిని ప్రశ్నించడం ప్రారంభించారన్నారు. అదే సమయంలో విమానం ఇంకా ఆలస్యంగా బయలు దేరే విషయాన్ని పైలెట్ చెప్పారన్నారు. ఈ విషయమై ప్రయాణీకులు పూర్తిగా తమ సహనాన్ని కోల్పోయారన్నారు. అయితే ఈ సమయంలో ప్రయాణీకుడు పైలెట్ పై దాడి చేయడం తప్పేనని ఎవ్జెనియా బెల్స్‌కియా అంగీకరించారు.
ఈ విషయమై ప్రయాణీకులను రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ప్రయాణీకులు తమ సహనాన్ని కోల్పోయారన్నారు.ఢిల్లీ-గోవా ఇండిగో విమానం (6E-2175) పైలెట్ అనూప్ కుమార్ విమానం మరింత ఆలస్యంగా బయలుదేరనుందని ప్రకటించే సమయంలో ఓ ప్రయాణీకుడు అతడిపై దాడి చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు ప్రకటించాయి.ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.
అయితే దాడి చేసిన ప్రయాణీకుడితో పాటు ఇతరులను విమాన సిబ్బంది శాంతింపజేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై ఏవియేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ అప్రమత్తమై విచారణ ప్రారంభించింది.