అంతరిక్షంలోకి ప్రధాని నరేంద్రమోదీ ఫోటో...!

By telugu news teamFirst Published Feb 15, 2021, 10:39 AM IST
Highlights

ఈ శాటిలైట్‌కు స‌తీష్ ధావ‌న్  లేదా ఎస్‌డీ శాట్ అనే పేరు పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా ఈ శాటిలైట్‌ను పంపించ‌నున్నారు. 

అంతరిక్షంలోకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో, భగవద్గీత కాపీని ఓ ప్రైవేట్ శాటిలైట్ సహాయంతో తీసుకువెళ్లనున్నారు. అంతేకాకుండా మరో 25వేల మంది పేర్లను కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్లనున్నారు. ఈ శాటిలైట్‌కు స‌తీష్ ధావ‌న్  లేదా ఎస్‌డీ శాట్ అనే పేరు పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా ఈ శాటిలైట్‌ను పంపించ‌నున్నారు. 

ఈ శాటిలైట్‌ను  స్పేస్ కిడ్జ్ ఇండియా అభివృద్ధి చేసింది. ఇది విద్యార్థుల్లో స్పేస్ సైన్స్‌ను ప్రోత్స‌హించే సంస్థ‌. ఈ శాటిలైట్ మ‌రో మూడు పేలోడ్స్‌ను కూడా తీసుకెళ్ల‌నుంది. ఇందులో ఒక పేలోడ్ స్పేస్ రేడియేష‌న్‌ను, ఒక‌టి మాగ్నెటోస్పియ‌ర్‌ను  అధ్య‌య‌నం చేయ‌నుండ‌గా మ‌రొక‌టి లోప‌వ‌ర్ వైడ్ ఏరియా క‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్ కోసం పంపిస్తున్నారు. 

కాగా.. త‌మ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లే క్ష‌ణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు  స్పేస్ కిడ్జ్ ఇండియా సీఈవో డాక్ట‌ర్ శ్రీమ‌తి కేశ‌న్ చెప్పారు. ‘స్పేస్‌లోకి వెళ్తున్న మా తొలి శాటిలైట్ ఇది. ఈ మిష‌న్‌ను అనుకున్న‌ప్పుడు పేర్లు పంపించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరాము. వారంలోనే 25 వేల మంది పేర్లు వ‌చ్చాయి. ఈ పేర్ల‌తోపాటు ప్ర‌ధాని మోదీ ఫొటోను, ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీని కూడా పంపుతాము ’అని కేశ‌న్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే పేర్లు పంపిన వారికి బోర్డింగ్ పాస్ ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ పేర్ల‌లో ఇస్రో చైర్‌ప‌ర్స‌న్ కే శివ‌న్‌, సైంటిఫిక్ సెక్ర‌ట‌రీ ఉమామ‌హేశ్వ‌ర‌మ్ పేర్లు కూడా ఉన్న‌ట్లు చెప్పారు. 

click me!