వెయిట్రెస్ కు పదిలక్షల టిప్ ఇచ్చిన కమెడియన్.. ఎక్కడంటే..

Published : Feb 15, 2021, 10:01 AM IST
వెయిట్రెస్ కు పదిలక్షల టిప్ ఇచ్చిన కమెడియన్.. ఎక్కడంటే..

సారాంశం

అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో చెప్పలేం. లిప్తపాటులో తలరాత మారిపోవచ్చు. అలాంటి ఘటనే న్యూయార్క లోకి ఓ రెస్టారెంట్ వెయిట్రెస్ విషయంలో జరిగింది. 

అదృష్టం ఎవర్ని ఎప్పుడు ఎలా పలకరిస్తుందో చెప్పలేం. లిప్తపాటులో తలరాత మారిపోవచ్చు. అలాంటి ఘటనే న్యూయార్క లోకి ఓ రెస్టారెంట్ వెయిట్రెస్ విషయంలో జరిగింది. 

సాధారణంగా రెస్టారెంట్లో భోజనమో, టిఫినో చేశాక వెయిటర్లకు పదో, పరకో టిప్ కింద ఇవ్వడం మామూలే. కొంతమందైతే గుట్టు చప్పుడు కాకుండా అదికూడా ఇవ్వకుండా వచ్చేస్తారు. అయితే అమెరికా, న్యూయార్క్ స్టేట్ లో ఓ కస్టమర్ వెయిట్రెస్‌కు 13 వేల డాలర్ల అంటే అక్షరాలా రూ. 9.42 లక్షలు టిప్ ఇచ్చాడు. దీంతో ఆమెకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు. 

నిజం చెప్పాలంటే ఆ కస్టమర్ సొంత డబ్బులు కూడా కావు అవి. అదేంటి అంటే.. ప్రముఖ కమెడియన్ రాబిన్ స్కాల్ భోజనం చేద్దామని న్యూయార్క్ లోని లిల్లీస్ కాక్‌టైల్ రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆమెకు  ఉల్యానా హ్రుచాక్ అనే వెయిట్రెస్‌ ఎంతో చక్కగా కొసరి కొసరి వడ్డించింది. 

తన భోజనం అయ్యాక వెయిట్రెస్ కు టిప్ ఇవ్వాలనుకుంది రాబిన్ స్కాల్. అయితే ఇక్కడే చిన్న గమ్మత్తు చేసిందామె.. తనకు ఇన్ స్ట్రాగ్రామ్ లో ఉన్న 1,41,000 ఫాలోవర్లకు వెయిట్రెస్ గురించి చెప్పింది. వారికి తోచినంత విరాళం ఇవ్వమని చిన్న పోస్ట్ పెట్టింది. అంతే క్షణాల్లో 13వేల డాలర్లు వచ్చిపడ్డాయి. 

వీటన్నింటినీ వెయిట్రెస్ కు ఇచ్చింది. మొదట ఈ విషయం వెయిట్రెస్ నమ్మలేదు.. మీరు నాతో జోక్ చేస్తున్నారా అంటూ అడిగింది. అయితే రాబిని స్కాల్ మాత్రం .. లేదు ఈ డబ్బు మొత్తం నీదే.. నా ఫాలోవర్లు ఇచ్చారంటూ క్రెడిట్ కూడా వాళ్లకే ఇచ్చేసింది. 

అయితే స్కాల్ కూడా ఇంత మొత్తంలో డబ్బలు కలెక్ట్ అవుతాయని ఊహించలేదట.. వెయ్యి డాలర్లు వస్తాయనుకుందట.. ఇంతపెద్ద మొత్తంలో రావడంతో సంతోషం వ్యక్తం చేసింది. దీంతో తన జీవితంలో కొత్తమార్పు రాబోతుందని తనకు ఆర్థికంగా సహాయం చేసినందుకు గాను స్కాల్ ఫాలోవర్లకు వెయిట్రెస్ కూడా ధన్యవాదాలు తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌