తమిళనాడులో నలుగురికి మంకీపాక్స్ లక్షణాలు: పుణెకి శాంపిల్స్ తరలింపు

Published : Jul 29, 2022, 03:16 PM ISTUpdated : Jul 29, 2022, 05:18 PM IST
తమిళనాడులో నలుగురికి మంకీపాక్స్ లక్షణాలు: పుణెకి శాంపిల్స్ తరలింపు

సారాంశం

తమిళనాడులోని ఒకే కుటుంబంలో నలుగురికి మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి.ఈ నులుగురి నుండి శాంపిల్స్ సేకరించి పుణెకు పంపారు. 


చెన్నై: Tamilnadu లో ఒకే కుటుంబంలో నలుగురిరికి మంకీ పాక్స్ లక్షణాలు కన్పించాయి. ఈ నలుగురి నుండి శాంపిల్స్ సేకరించి పుణెకు పంపారు.  దేశంలోని పలు రాష్ట్రాల్లో Monkeypox కేసులు పెరిగిపోతున్నాయి.ఈ తరుణంలో  తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఈ లక్షణాలు కన్పించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నలుగురికి మంకీపాక్స్  సోకిందా లేదా అనే విషయమై నిర్ధారణ కాలేదు. Pune కు పంపిన శాంపిల్స్ ను పరీక్షించిన తర్వాత ఈ విషయమై అధికారులు స్పష్టత ఇవ్వనున్నారని ప్రముఖ తెలగు న్యూస్ చానెల్ ఎన్టీవీ ప్రసారం చేసింది. 

ఇప్పటికే మూడు కేసులు Kerala రాష్ట్రంలో నమోదయ్యాయి. Delhi లో రెండు కేసులు నమోదయ్యాయి.  మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు మార్గదర్శకాలను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దేశాలను మంకీ పాక్స్ పట్ల అప్రమత్తం చేసింది. 

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళ రాష్ట్రంలోనే నమోదైంది. మూడు కేసులు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. దుబాయి నుండి వచ్చిన ఈ ముగ్గురు మంకీపాక్స్ బారినపడినట్టుగా వైద్య శాఖాధికారలుు ప్రకటించారు. ఈ ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంకీ పాక్స్ కేసు నమోదైంది. కామారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి మంకీ పాక్స్ సోకింది. బాధితుడి శరీరంపై దద్దర్లు రావడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకొన్నాడు. దీంతో అతనికి మంకీపాక్స్ సోకిందని వైద్యులు ప్రకటించారు. 

also read:మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరో హెచ్చరిక..!

తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో గల కింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటిివ్ మెడిసిన్ రీసెర్చ్ సెంటర్ లో మంకీపాక్స్ వ్యాధిని గుర్తించేందుకు పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిని ఇచ్చిందని తమిళనాడు ఆరోగ్య మంత్రి తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని  మంకీపాక్స్ లక్షణాలు ఉన్న వరి నుండి శాంపిల్స్ ను సేకరించి ప్రస్తుతం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపుతున్నారు. త్వరలో కింగ్  ఇనిస్టిట్యూట్  కు పంపనున్నారు. 

అంతర్జాతీయ ప్రయాణీకులకు స్క్రీనింగ్ నిర్వహించాలని ఆయా రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు  జారీ చేసింది. విమానాశ్రయాలు, పోర్టులు, అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. 
 

 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే