పాక్‌పై సర్జికల్ స్ట్రైక్స్-2: ‘‘నేత్ర’’ నాయకత్వంలో..

By Siva KodatiFirst Published Feb 27, 2019, 12:20 PM IST
Highlights

21 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించి విమానాలు తిరిగి భారత భూభాగాన్ని చేరడంలో ‘‘నేత్ర’’ నిఘా విమానం కీలక భూమిక పోషించింది. దీనిలోని ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ సాంకేతికత మన యుద్ధ విమానాలపైకి దూసుకొచ్చే క్షిపణులను గుర్తించి పైలట్లను, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముందుగానే అప్రమత్తం చేస్తుంది.

ఉగ్రతండాలను నిర్మూలించాలని, ఉగ్రవాదులకు సాయాన్ని నిలిపివేయాలని ఎన్నో ఏళ్లుగా భారత్ సూచనలను పాకిస్తాన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీనికి తోడు పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడితో భారతీయుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

దీంతో పాకిస్తాన్‌కు గట్టి బదులివ్వాలని భావించిన భారత ప్రభుత్వం.. సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆదేశించింది. దీంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 12 యుద్ధ విమానాలను పాక్ భూభాగంలోకి పంపి.. ఉగ్రవాద శిబిరాలపై బాంబుల వర్షం కురిపించింది.

21 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా ముగించి విమానాలు తిరిగి భారత భూభాగాన్ని చేరడంలో ‘‘నేత్ర’’ నిఘా విమానం కీలక భూమిక పోషించింది. దీనిలోని ఇన్ఫ్రారెడ్ డిటెక్షన్ సాంకేతికత మన యుద్ధ విమానాలపైకి దూసుకొచ్చే క్షిపణులను గుర్తించి పైలట్లను, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ముందుగానే అప్రమత్తం చేస్తుంది.

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) దీనిని బెంగళూరులో అభివృద్ధి పరిచింది. ఆకాశంలో మన సరిహద్దు లోపల ఉంటూనే శత్రుదేశ భూభాగంలో 450-500 కి.మీ దూరంలోని లక్ష్యాలను గుర్తించగల సామర్ధ్యం దీని సొంతం.

నిరాటంకంగా ఐదు గంటల పాటు ఇది ఆకాశంలో విహరించగలదు. శత్రు సైనికుల మధ్య జరిగే సమాచార మార్పిడిని ఒడిసి పట్టుకోవడం నేత్రకున్న అదనపు బలం. ఎయిర్‌ఫోర్స్ కోసం డీఆర్‌డీవో రెండు నేత్ర విమానాలను అభివృద్ధతి పరిచింది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలున్న నేత్ర ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. 

12 భారత విమానాలు వస్తుంటే... పాక్ ఎందుకు గుర్తించలేకపోయింది..?

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?

 

click me!