బడ్గాంలో కుప్పకూలిన మిగ్ యుద్ధ విమానం: ఇద్దరు పైలైట్లు మృతి

By narsimha lodeFirst Published Feb 27, 2019, 11:43 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గాంలో మిగ్ యుద్ద విమానం బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

జమ్మూకాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని బుడ్గాంలో మిగ్ యుద్ద విమానం బుధవారం నాడు కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అన్వేషిస్తున్నారు.

బుడ్గాంలో మిగ్ యుద్ధ విమానం కుప్పకూలిన వెంటనే భారీ శబ్దంతో పేలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. 

మిగ్ యుద్ధ విమానం కుప్పకూలిన వెంటనే ఈ ప్రాంతంలో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఈ మంటలను ఆర్పేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు ఈ విమానం కుప్పకూలిందా లేక ఇతర ఏమైనా ఘటనలు చోటు చేసుకొన్నాయా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

పాక్ నుండి కవ్వింపు చర్యలు ఉంటాయని భావిస్తూ భారత వైమానిక దళం జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో పహారా కాస్తోంది. ఈ తరుణంలో ఈ విమానం కుప్పకూలింది. గతంలో కూడ మిగ్ యుద్ధ విమానాలు కుప్పకూలిన ఘటనలు చోటు చేసుకొన్నాయి.
 

click me!