సాంబార్‌లో ఉన్నది.. ఇడ్లీనా? ఐస్ క్రీమా?.. వైరల్ అవుతున్న ఆ పిక్‌పై శశిథరూర్ కామెంట్

By telugu teamFirst Published Oct 1, 2021, 4:31 PM IST
Highlights

ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఇడ్లీనా? ఐస్ క్రీమా? అనే డైలామాలో నెటిజన్లు పడిపోయారు. నిజానికి ఇవి ఐస్ క్రీమ్‌లా కనిపిస్తున్నప్పటికీ బెంగళూరులోని ఓ రెస్టారెంట్ సృజనాత్మక ఆలోచనల్లో నుంచి పుట్టిన కొత్తరకం ఇడ్లీలు. ఇడ్లీలు రూపు మార్చి ఐస్ క్రీమ్ పుల్లలకు అమర్చిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బిజినెస్‌మన్ ఆనంద్ మహీంద్రాలూ ట్వీట్ చేశారు.
 

బెంగళూరు: ఆహారపుటలవాట్లలో అనేక మార్పులు వస్తుంటాయి. అందులో కొన్ని ఎప్పటికీ నిలిచిపోతుంటాయి. సాంప్రదాయ ఆహారంపై అనేక ప్రయోగాలు జరుగుతుండటం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటుంటాం. ఇటీవలే మిర్చీలో మ్యాగీ, కుల్హద్‌లో పిజాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఫేవరేట్ ఇడ్లీకి సంబంధించిన చిత్రాలు మెయిన్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా ఇడ్లీలు గుండ్రంగా మెత్తగా సున్నితంగా ఉంటాయి. కానీ, ఈ చిత్రంలోని ఇడ్లీలు మాత్రం ఐస్ క్రీం పుల్లలకు అంటించి చిత్రంగా కనిపిస్తున్నాయి. ఒక ఇడ్లీ సాంబార్‌లో ముంచి ఉంది. ఈ చిత్రాన్ని చూస్తే దాన్ని ఇడ్లీ అని ఎవరూ అనుకోరు. కచ్చితంగా అది ఐస్ క్రీమే అయి ఉంటుందని, లేదంటే కుల్ఫీ అయి ఉంటుందని నిర్ధారణకు వస్తారు. కానీ, అవి ఇడ్లీలని నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది బెంగళూరులోని ఓ రెస్టారెంట్ కొత్త ప్రయోగం.

 

absurd but practical! https://t.co/R3yCCMwKVt

— Shashi Tharoor (@ShashiTharoor)

ట్విట్టర్‌లో మహేంద్రకుమార్ అనే వ్యక్తి ఈ పోస్టు చేశారు. బెంగళూరులోని ఓ రెస్టారెంట్‌లో తనకు ఇడ్లీలను ఇలా సర్వ్ చేశారని వివరించారు. ఆహార ఆవిష్కరణలకు బెంగళూరు దానికదే సాటి అని చాటిచెప్పారు. అయితే, ఈ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఈ ఆవిష్కరణను మెచ్చుకుంటుండగా, ఇంకొందరు తమకు సంప్రదాయ ఆకారంలోని ఇడ్లీలు ప్రియమని ట్వీట్లు చేశారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రాలూ దీనిపై స్పందించకుండా ఉండలేకపోయారు.

శశిథరూర్ ఈ చిత్రాలపై నిరర్ధకం, కానీ ప్రాక్టికల్‌గా ఉన్నదని కామెంట్ చేశారు. కాగా, ఆనంద్ మహీంద్ర తనదైన శైలిలో ట్వీట్ చేశారు. భారత దేశ ఆవిష్కరణల రాజధాని బెంగళూరు ఎవరూ ఊహించిన రంగాల్లోనూ తన సృజనాత్మకతను ప్రదర్శిస్తున్నదని తెలిపారు.

click me!