ముంబయిలో ఓ కారు డ్రైవర్ ట్రాఫిక్ నిబంధనలు కాదు కదా.. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారు బానెట్‌పై ఎక్కి కూర్చున్నా ఆగలేదు. ముందుకే వేగంగా పోనిచ్చాడు. చలాన్ వేసే అవకాశాన్నీ ఇవ్వలేదు. చివరికి కారు ఆపి పరుగులు పెట్టగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
ముంబయి: సాధారణంగా రోడ్డు ఎక్కాలంటే వాహన ధ్రువపత్రాలు, లైసెన్స్‌లు దగ్గర పెట్టుకుని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు చోదకులు. కానీ, ముంబయికి చెందిన ఓ డ్రైవర్ నిబంధనలు యథేచ్చగా ఉల్లంఘించడమే కాదు.. ఎవరినీ లెక్క చేయకుండా ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. ఓ ట్రాఫిక్ పోలీసు వచ్చి అడ్డంగా నిలుచున్నా.. ఆగలేడు.. కారు బానెట్ పై ఎక్కి కూర్చున్నా.. అలాగే దూసుకెళ్లాడు. ఈ ఘటనకు చెందిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలోని ఆంధేరి వెస్ట్ ఆజాద్ మెట్రో స్టేషన్ దగ్గర ట్రాఫిక్ కానిస్టేబుల్ విజయ్ సిన్హా గౌరవ్ విధులు నిర్వర్తిస్తున్నారు. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఓ బ్లాక్ ఎస్‌యూవీ కారు అటువైపుగా రాంగ్ డైరెక్షన్ వెళ్తూ కనిపించింది. వెంటనే కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు ట్రాఫిక్ కానిస్టేబుల్ సంజ్ఞ చేశారు. కానీ, ఆ డ్రైవర్ అదేం లెక్క చేయలేదు. తాను ఓ కార్డు చూపించి మీడియా పర్సన్ అని పేర్కొంటూ ముందుకే వెళ్లబోయారు. స్పాట్ నుంచి బయటపడటానికి డ్రైవర్ ప్రయత్నించాడు.
undefined
here is Full video! incident at Andheri DN Nagar a constable sat on Car bonnet to stop driver for driving in wrong direction
(He wanted to stop him to take pic for echallan) ?
pic.twitter.com/rohE8gUsjM
ఇది గమనించి గౌరవ్ వెంటనే అటువైపుగా పరుగెత్తాడు. కారును ఆపి చలాన్ వేయాలని భావించాడు. కానీ, కారు స్లో గా మూవ్ అవుతూనే ఉన్నది. తప్పదనుకుని ఆయన కారు బానెట్ ఎక్కారు. అలాగైనా, కారు ఆపుతాడని ఆశించాడు. కానీ, ఆ తెంపరి కారును ఆపకపోగా మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు. బానెట్‌పై ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎక్కి కూర్చున్నప్పటికీ కారును వేగంగా తీసుకుపోయాడు. కొంత దూరం పోయాక కారును ఆపి డ్రైవర్ పరుగుపెట్టాడు. బానెట్‌పై భయంతో ఉన్న కానిస్టేబుల్ కిందకు దిగారు. వెంటనే డీఎన్ నగర్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా వ్యక్తిని కనుగొన్నారు. త్వరలోనే ఆయనను పట్టుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.