
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) డేటాను పరిశీలస్తే పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలు తమ విధులు నిర్వర్తించకపోతే వారిపై శారీరకంగా దాడి చేయడం (గృహ హింస) పర్వలేదని దేశంలోని సగం మంది పురుషులు, స్త్రీలు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా 45 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు ఈ ఆలోచనతోనే ఉన్నారు. అయితే ఈ సంఖ్య కర్ణాటకలో చాలా ఎక్కువగా ఉంది. అక్కడ 76.9 శాతం మహిళలు, 81.9 శాతం పురుషులు విధులు నిర్వర్తించని మహిళపై శారీరకంగా దాడి చేయడం సరైనదే అని నమ్ముతున్నట్టుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా చెబుతుంది.
భార్య చెప్పకుండా బయటకు వెళ్లడం, సరిగ్గా వంట చేయకపోవడం, భర్త ఆమె విశ్వసనీయతను అనుమానించినట్లయితే.. వంటి సాధారణ కారణాల వల్ల భార్యను కొట్టడం సరైనదని ప్రతివాదులు అంగీకరించినట్టుగా ఈ సర్వే డేటాలో వెల్లడైంది. అయితే భర్తతో శృంగారాన్ని నిరాకరిస్తే భార్య భౌతిక దాడిగా అర్హురాలిగా కొందరు పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం అనే చెప్పాలి. ప్రతివాదుల్లో 11 శాతం మహిళలు, 9.7 శాతం పురుషులు ఈ వాదనను సమర్ధిస్తున్నారు. సెక్స్ నిరాకరిస్తే భార్యను భర్త కొట్టాలని అభిప్రాయపడ్డారు.
గృహ హింసకు ప్రధానంగా అత్తమామలను అగౌరవపరచడం ఒక ప్రాథమిక కారణమని చాలా మంది ప్రతివాదులు అభిప్రాయపడ్డారు. ఈ రకమైన అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు ఉన్నారు. ఇల్లు, పిల్లలను నిరక్ష్యం చేయడం చేయడం కూడా కారణమని 28 శాతం స్త్రీలు, 22 శాతం పురుషులు నమ్ముతున్నారు. భర్తతో వాదించడం వల్లే భార్యపై భౌతిక దాడులు జరుగుతున్నాయని 22 శాతం మహిళలు, 20 శాతం పురుషులు భావిస్తున్నారు. భార్య విశ్వసనీయతను అనుమనించడం గృహహింసకు కారణమని 20 శాతం మంది మహిళలు, 23 శాతం మంది పురుషులు నమ్ముతున్నారు.
గృహ హింసపై పురుషులలో వైఖరులు మరింత దిగజారాయని డేటా సూచిస్తుంది. NFHS-4 ప్రకారం.. భార్యను కొట్టడాన్ని సమర్ధించేవారి శాతం గతంలో ఉన్న 52 నుంచి 44కు పడిపోయింది. అయితే NFHS-5కు వచ్చిసరికే ఇది రెండు శాతం పెరిగింది. NFHS-4లో 44 శాతం ఉండగా.. అది 44 శాతానికి పెరిగింది.