
ముంబై : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి Nirmala Sitharaman తన హోదాను పక్కనపెట్టి మరీ ఓ కార్యక్రమంలో NSDL ఎండీకి ప్రసంగం మధ్యలో water bottle అందించే ప్రశంసలు అందుకుంటున్నారు. నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్ (ఎన్ఎస్ డీఎల్) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ముంబైలోని ఓ హోటల్లో విద్యార్థుల కోసం పెట్టుబడి అవగాహనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన వారి గురించి ఎన్ఎస్ డీఎల్ ఎండీ Padmaja Chunduru మాట్లాడుతున్నారు.
ప్రసంగం మధ్యలో మంచినీళ్ల కోసం ఆమె హోటల్ సిబ్బందిని అడిగారు. దీంతో వేదికపైనే ఉన్న నిర్మల సీతారామన్ వెంటనే తన కుర్చీ నుంచి లేచి ఆమె దగ్గరికి వెళ్లి గ్లాస్ తో పాటు మంచినీళ్ళ బాటిల్ ను అందించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైనవారు నిర్మలా సీతారామన్ విశాల హృదయాన్ని అభినందిస్తూ చప్పట్లతో ప్రశంసించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుత సామాజిక మాధ్యమాల్లోచక్కర్లు కొడుతోంది.
పలువురు Social media ద్వారా నిర్మలాసీతారామన్ ను కొనియాడుతున్నారు. ‘ఇది కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ విశాల హృదయం, వినయం, విలువలను ప్రతిబింబిస్తుంది’ అని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెయిట్ చేశారు. ‘ఇది ఎంత అద్భుతమైన సంఘటన.. మీ వినయాన్ని ఎంతో గౌరవిస్తున్నాను మేడం’ అంటూ నిస్సాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీఈఓ సందీప్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 28న డిజిటల్ రూపీ మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ హింట్ ఇచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే డిజిటల్ రూపీని మార్కెట్లోకి ప్రవేశ పెట్టేందుకు సిద్దం అవుతోంది. తాజాగా జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న నిర్మలా సీతారామన్ ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ డిజిటల్ రూపీ రూపకల్పనలో సమన్వయంగా పనిచేస్తున్నాయని పేర్కొంది.
డిజిటల్ కరెన్సీని విడుదల చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2023 నాటికి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. FICCI నిర్వహించిన ఒక కార్యక్రమంలో దీనికి సంబంధించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఆర్థిక మంత్రి మాట్లాడుతూ డిజిటల్ కరెన్సీ వివిధ వాణిజ్య ఉపయోగాల అవకాశాలను అన్వేషించడంలో ప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిమగ్నమై ఉన్నాయి. డిజిటల్ కరెన్సీతో ఆర్థిక చేరిక లక్ష్యాలను నెరవేర్చడమే కాకుండా వివిధ వ్యాపార లక్ష్యాలను సాధించడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆర్థిక మంత్రి చెప్పారు. డిజిటల్ కరెన్సీని విడుదల చేసే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. 2023 నాటికి డిజిటల్ కరెన్సీని ప్రవేశపెట్టాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు