
తండ్రి 20 ఏళ్ల పాటు ఆ వృద్ధ దంపతుల వద్ద నమ్మకంగా పని చేశాడు. అనారోగ్య కారణంతో అతడు తన స్వస్థలం అయిన నేపాల్ కు వెళ్లిపోయాడు. తరువాత అతడి కుమారుడే ఆ ఇంటికి డ్రైవర్ గా వచ్చాడు. తండ్రిపై నమ్మకంతో అతడిని పనిలో పెట్టుకున్నారు. పదకొండేళ్ల పాటు బాగానే పని చేసిన అతడి మనసులో దుర్భుద్ధి పెట్టింది. ఆ వృద్ధ దంపతులను హతమార్చి డబ్బులు కాజేద్దామనుకున్నాడు. అనుకున్నట్టుగానే మరో వ్యక్తి సాయంతో వారిని చంపేశాడు. కానీ డబ్బులు దొరకలేదు. చివరికి బంగారు నగలు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కానీ పోలీసులు వారిని పట్టుకొని కటకటాల్లో వేశారు.
సినిమా సీన్లను తలపించే ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో పోలీసుల విచారణ చేసినప్పుడు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేరంలో ప్రమేయం ఉన్న నిందితులను ఏపీలోని ఒంగోలులో ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మైలాపూర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కన్నన్ ఆదివారం వివరించారు.
తమిళనాడు రాష్ట్రంలోని మైలాపూర్ లో వృద్ధ దంపతులు శ్రీకాంత్ (60), అనురాధ (55)లు ఉన్నారు. శ్రీకాంత్ ఆడిటర్ గా పని చేసేవారు. అయితే వీరికి చెన్నై శివారులోని నెమలిచ్చేరిలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇందులో నేపాల్ దేశానికి చెందిన లాల్ కిషన్ (lal kishan) 20 సంవత్సరాల పాటు సెక్యూరిటీగా విధులు నిర్వహించాడు. దీంతో ఆ కుటుంబంలో నమ్మకమైన వ్యక్తిగా మారిపోయాడు. కొంత కాలం తరువాత అనారోగ్య సమస్యలు రావడంతో తన ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం అతడి కుమారుడు కృష్ణ డ్రైవర్ గా పని చేసేందుకు అదే ఇంటికి వచ్చాడు. దాదాపు 11 ఏళ్ల నుంచి వారి వద్దనే అతడు పని చేస్తున్నాడు. ఈయన కూడా ఆ వృద్ధ దంపతులకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా మారిపోయాడు.
3 నెలల కిందట ఆడిటర్ శ్రీకాంత్ స్థలం అమ్మకం విషయంలో ఎవరితోనే మాట్లాడారు. ఈ సంభాషణ అంతా కారులో జరగడంతో లాల్ కృష్ణ విన్నాడు. రూ.40 కోట్ల కు ఆ డీల్ ఫిక్స్ అయినట్టు, ఆ డబ్బులు ఇంట్లో ఉన్నాయని అతడికి అర్థం అయ్యింది. అప్పుడు అతడికి దుర్భుద్ది పుట్టింది. ఈ డబ్బులను చోరీ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. కొంత కాలం తరువాత శ్రీకాంత్, అనురాధ దంపతులు తమ కుతరు సునంద డెలివరీ కోసం అమెరికాకు వెళ్లారు. ఇదే మంచి సమయంగా భావించి కృష్ణ ఆ ఇంట్లోకి చొరబడి అంతా వెతికాడు. కానీ ఎక్కడా ఆ డబ్బు జాడ కనిపించలేదు. దీంతో డార్జిలింగ్ కు చెందిన తన స్నేహితుడు, డ్రైవర్ అయిన రవిరాయ్ కు ఈ ప్లాన్ మొత్తం చెప్పాడు. సాయం చేయాలని కోరాడు. దీనికి అతడు ఒప్పుకున్నాడు. ఆ వృద్ద దంపతులు ఇండియాకు రాగానే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు.
గత శుక్రవారం తెల్లవారుజామున వృద్ధ దంపతులు చైన్నైకు చేరుకున్నారు. వారిని లాల్ కృష్ణ పికప్ చేసుకొని కారులో మైలాపూర్ కు తీసుకెళ్లాడు. అక్కడ అనుకున్న ప్రకారం ముందుగానే రవిరాయ్ ఉన్నాడు. ఇద్దరూ కలిసి వారిని తాడుతో కట్టేశారు. రూ.40 కోట్లు ఎక్కడున్నాయో చెప్పాలని, అవి తమకు ఇవ్వాలని బెదిరించాడు. చిత్రహింసలకు గురి చేశారు. దంపతులు ఈ విషయాలు చెప్పకపోవడంతో వారిని కర్రలతో చితకబాది చంపేశారు. వారి వద్ద నుంచి తాళం తీసుకొని ఇంట్లోని బంగారాన్ని, వెండి వస్తువులను చోరీ చేసి కారులో పెట్టుకున్నారు. మృతదేహాలను గొనె సంచుల్లో కుక్కి కారులో పెట్టారు. ఇళ్లంతా క్లీన్ చేసి నెమలిచ్చేరి ఫామ్ హౌస్ కు చేరుకొని అక్కడ ముందే తవ్వి పెట్టిన గుంతో దంపతులను పాతిపెట్టారు.
అక్కడి నుంచి నేపాల్ కు పారిపోదామని ప్లాన్ చేశారు. అయితే తల్లిదండ్రులకు ఎన్ని స్లార్లు ఫోన్ చేసిన కలవకపోవడంతో కుమర్తె సునంద ఇక్కడ ఉన్న చుట్టాలకు ఫోన్ చేశారు. వారు పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో వారు రంగంలోకి ఘటనను ఛేదించారు. నిందితులను ఒంగోళు నుంచి ఆదివారం పట్టుకొచ్చారు. దీని కోసం ఏపీ పోలీసుల సాయం తీసుకున్నారు. నిందుతల వద్ద నుంచి సుమారు 9 కిలోల బంగారం, 70 కిలోల వెండిని, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రాయపేట హాస్పిటల్ కు తీసుకెళ్లారు.