ఇండియాలో సమూహ వ్యాప్తి లేదు: తప్పును అంగీకరించిన డబ్ల్యూహెచ్‌వో

By Siva Kodati  |  First Published Apr 10, 2020, 5:38 PM IST

భారతదేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించిన నివేదికలో భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ 19 సమూహ వ్యాప్తి దశలో ఉందని రాయడం పోరపాటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది. 


భారతదేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించిన నివేదికలో భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ 19 సమూహ వ్యాప్తి దశలో ఉందని రాయడం పోరపాటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అంగీకరించింది.

ప్రస్తుతం ఇండియాలో సమూహవ్యాప్తి లేదని, ఆయా ప్రాంతాల్లో కొన్ని కేసులు మాత్రమే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. కాగా శుక్రవారం మధ్యాహ్నం నాటికి భారతదేశంలో 6,412 కరోనా కేసులు నమోదవ్వగా... 199 మంది మరణించారు.

Latest Videos

Also Read:కరోనా వ్యాక్సిన్ తయారికి ప్రయోగాలు: కేంద్ర మంత్రి హర్షవర్ధన్

చివరి 24 గంటల్లో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంలో కోవిడ్ 19 మూడో దశలో లేదని ఇంతకుముందే తెలిపింది. ఎవరి నుంచి వైరస్ సోకిందో తెలియని స్థితిలో ఉన్నప్పుడే సమూహ వ్యాప్తిగా పేర్కొంటారు.

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ శుక్రవారం ఉదయం నిర్వహించిన సమావేశంలోనూ దేశంలో సమూహ వ్యాప్తి లేదని స్పష్టం చేశారు. 600- 400 జిల్లాల్లో అసలు వైరస్ ఉనికే లేదని, కేవలం 133 జిల్లాలే కరోనాకు కేంద్రాలుగా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Also Read:ఇండియాలో 24 గంటల్లో 678 కొత్త కేసులు, 199 మంది మృతి

వైరస్ సమూహ వ్యాప్తికి చేరుకుంటే ఈ విషయం దాచేది ఉండదని.. ప్రజలకు వెల్లడిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ గతంలోనే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాల్లో వైరస్ వ్యాప్తిని, ధ్రువీకరించిన కేసులు లేకపోవడం చాలా తక్కువ కేసులు, కొన్ని కేసులు, సమూహ వ్యాప్తిగా విభజించింది. గురువారం భారత స్థితిని సమూహ వ్యాప్తిగా నమోదు చేసిన డబ్లూహెచ్‌వో శుక్రవారం కొన్ని కేసులుగా మార్చింది. 

click me!