మూడోసారి మోడీ ప్రభుత్వమే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ఎన్డీయే నేతలు..!

By ramya Sridhar  |  First Published Jun 7, 2024, 3:52 PM IST

ఎన్డీయే నుంచి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితీశ్ కుమార్, ఎక్నాథ్ షిండే లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క్లెమ్ చేడయానికి రావడం గమనార్హం.


ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే మరోసారి సత్తా చాటింది.  పోటీపోటీగా జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీయే  293 సీట్లను గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్ ని దాటడంతో.. మరోసారి కేంద్రంలో అధికారం  చేపట్టనుంది.

కాగా...  పలుమార్లు జరిపిన సమావేశాల తర్వాత... ఎన్డీయే నాయకులు బృందం నేడు అంటే శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆమెతో సమావేశమై.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అనుకుంటున్న ప్రతిపాదనను ద్రౌపది ముర్ము ముందు ఉంచారు.  ఎన్డీయే నుంచి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితీశ్ కుమార్, ఎక్నాథ్ షిండే లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు క్లెమ్ చేడయానికి రావడం గమనార్హం.

Latest Videos

కాగా.. ప్రధాని నరేంద్రమోదీ ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు.  కాగా.. ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో, ఎన్‌డిఎ గ్రూపు 293 స్థానాలను గెలుచుకుంది, ఇది మెజారిటీకి మ్యాజిక్ ఫిగర్ 272 కంటే ఎక్కువ. అయితే, ఈసారి ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ మెజారిటీ సంఖ్య కంటే చాలా తక్కువగా ఉంది, కాబట్టి  ఇతర పార్టీల నేతలను  ఒప్పించడానికి సుదీర్ఘ రౌండ్ సమావేశాలు జరిగాయి.
సుదీర్ఘ సమావేశాల అనంతరం  శుక్రవారం మధ్యాహ్నం, NDA నాయకులు రాష్ట్రపతితో  సమావేశమయ్యారు. అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వాదనలు వినిపించారు.దీంతో, ముచ్చటగా మూడోసారి.. ఎన్డీయే కేంద్రంలో చక్రం తిప్పనుంది. 

click me!