Coronavirus: దేశంలో క‌రోనా క‌ల్లోలం.. ముంబ‌యిలో 70 శాతం, ఢిల్లీలో 50 శాతం కేసుల పెరుగుద‌ల

By Mahesh Rajamoni  |  First Published Dec 29, 2021, 5:06 AM IST

Coronavirus: దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ క‌ల్లోలం రేపుతున్న‌ది. సాధార‌ణ కోవిడ్ కేసుల‌తో పాటు కొత్త వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఢిల్లీ, ముంబ‌యిలో కొత్త కేసులు గ‌ణ‌నీయంగ పెర‌గ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 
 


Coronavirus: ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్ నెల చివ‌రి వారంలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్ కొత్త వేరియంట‌ట్ ఒమిక్రాన్ ప‌లు దేశాల్లో రికార్డు స్తాయిలో వ్యాపిస్తోంది. బ్రిట‌న్‌, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఒమిక్రాన్ కేసులు గుర్తించిన త‌ర్వాత అక్క‌డ‌.. క‌రోనా వైర‌స్ కేసులు నిత్యం ల‌క్ష‌ల్లో న‌మోద‌వుతుండ‌టం స‌ర్వ‌త్ర ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇక భార‌త్ లోనూ ఈ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నిత్యం ప‌దుల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబ‌యిలోనూ కరోనా వైర‌స్ కొత్త కేసుల భారీగా పెరుగుతున్నాయి. అలాగే, ఒమిక్రాన్ కేసులు సైతం వెలుగుచూస్తున్నాయి. ఒక్క‌రోజులోనే ముంబ‌యిలో 70 శాతం క‌రోనా మ‌హమ్మారి కేసులు పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో 50 శాతం పెరుగుదల నమోదు చేశాయి. ఆర్థిక రాజధానిలో 1377 కరోనా కేసులు నమోదు కాగా, దేశ రాజధానిలో 496 కేసులు వెలుగుచూశాయి. అలాగే, క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ.. ఈ రెండు న‌గ‌రాల్లో ఒక్కొక్క‌రు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం ట్రెండ్ గ‌మ‌నిస్తే.. ముంబ‌యి, ఢిల్లీలో క‌రోనా వైర‌స్ కేసుల పురుగుద‌ల స్ప‌ష్టంగా తెలుస్తోంది. 

Also Read: FAIMA:నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ !

Latest Videos

undefined

ఢిల్లీలో గ‌త రెండు వారాల వ్యవధిలో ఒమిక్రాన్ కేసులు 2-3 శాతం నుంచి  ఏకంగా 25-30 శాతానికి పెరిగాయి. దేశంలో జన్యక్రమాన్ని విశ్లేషించే కన్సార్టియం (ఇన్సాకాగ్) ఆధ్వర్యంలోని ఢిల్లీ ల్యాబ్ ఈ విషయాన్ని పేర్కొంది. ఢిల్లీ ఆంక్షలు విధించినట్లు ప్రకటించిన గంటల్లోనే 50 శాతం కరోనా కేసులు పెరగడం ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ది.  ఇక ఢిల్లీలో క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స‌ర్కారు అప్ర‌మ‌త్త‌మైంది. ఈ క్ర‌మంలోనే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. అలాగే, నైట్ క‌ర్ఫ్యూను కూడా విధించింది. కేసులు భారీగా  పెరగడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ లెవెల్-I (ఎల్లో అలర్ట్)ని అమలు చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్ల‌డించారు. దీనిలో భాగంగా ఎల్లో అలర్ట్ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేశారు. ఆంక్ష‌ల నేప‌థ్యంలో  సినిమా హాళ్లు, జిమ్స్, స్పాలు, స్కూల్స్, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్పాలు, జిమ్‌లు, ల్టీప్లెక్స్‌లు, బాంక్వెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు మూసివేయనున్నారు. పెండ్లిండ్లు, అంతిమ సంస్కారాలకు 20 మందికి మాత్రమే అనుమతించనున్నారు.

Also Read: coronavirus: మ‌రో హైద‌రాబాద్ క‌రోనా వ్యాక్సిన్ కు అనుమ‌తి.. దేశంలో అందుబాటులో ఉన్న టీకాలివే !

క‌రోనా కేసులు అధికంగా న‌మోద‌వుతున్న మ‌హారాష్ట్రలో కూడా ప్ర‌భుత్వం ఆంక్ష‌లు విధించింది. కొత్త సంవత్సరం వేడుకలను కూడా ప్రభుత్వం నిషేధించింది. . రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు బహిరంగ ప్రదేశాల్లో ఐదుగురు కన్నా ఎక్కువ మంది ఉండొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఇండోర్ వేడుక‌ల‌పైనా ప‌లు ఆంక్ష‌లు విధించింది. జిమ్స్‌, స్పా, థియేటర్లు 50శాతం కెపాసిటీతో నడిపించుకోవాలని స్పష్టం చేసింది. ఇదిలావుండ‌గా, వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లను కేంద్ర ప్ర‌భుత్వం ముమ్మ‌రం చేస్తూ..  హైద‌రాబాద్ క‌రోనా టీకా కార్బివాక్స్ తో పాటు మ‌రో వ్యాక్సిన్‌, యాంటీవైర‌ల్ డ్ర‌గ్ కు అత్య‌వ‌స‌ర వినియోగం కింద ఆమోదం తెలిపింది. క‌రోనా నేప‌థ్యంలో అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి పొందిన వాటిలో హైద‌రాబాద్ చెందిన క‌రోనా టీకా కార్బివాక్స్,  సీరం త‌యారు చేసిన కోవిడ్ టీకా కోవోవాక్స్, యాంటీ-వైరల్ డ్రగ్ మోల్నుపిరవిర్ ఉన్నాయి.కరోనా కట్టడికి దేశంలో ప్రస్తుతం 8 వ్యాక్సిన్లు, నాలుగు ఔషధాలు, చికిత్స విధానాలకు అత్యవసర వినియోగం కింద అనుమతులు లభించాయి. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి కోసం దేశంలో అందుబాటులో ఉన్న టీకాల్లో  కోవిషీల్డ్, కోవాక్సిన్, జైకోవి-డి, స్పుత్నిక్ వి, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్, కార్బివాక్స్, కోవోవాక్స్ లు ఉన్నాయి. తాజాగా అత్య‌వ‌స‌ర వినియోగం కింత అనుమ‌తులు పొందిన వాటిలో హైదరాబాద్‌కు చెందిన ‘బయలాజికల్‌ ఈ’  కరోనా వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌లోని గ్లెకోప్రొటీన్‌లో ఉన్న కీలకమైన ఆర్బీడీ ఆధారంగా త‌యారు చేసిన కార్బివాక్స్ క‌రోనా టీకా ఉంది.

Also Read: Work From Home: ఒమిక్రాన్ దెబ్బ‌.. ఈ కంపెనీల్లో శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోం !

click me!