మానసికంగా అలసిపోయాను.. ఏకాంతంలోకి వెళ్తున్నా.. ఎన్సీపీ ఎంపీ అమోల్ కొల్హే

By team teluguFirst Published Nov 9, 2021, 11:12 AM IST
Highlights

తాను మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా అలసిపోయాయని.. అందుకే ఏకాంతంలోకి వెళ్తున్నట్టుగా ఓ ఎంపీ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని షిరూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి (Shirur constituency) చెందిన ఎన్‌సీపీ ఎంపీ అమోల్ కొల్హే(Amol Kolhe) ఈ విధమైన ప్రకటన చేశారు. 

తాను మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా అలసిపోయాయని.. అందుకే ఏకాంతంలోకి వెళ్తున్నట్టుగా ఓ ఎంపీ ప్రకటించడం హాట్ టాపిక్‌గా మారింది. మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని షిరూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి (Shirur constituency) చెందిన ఎన్‌సీపీ ఎంపీ అమోల్ కొల్హే(Amol Kolhe) ఈ విధమైన ప్రకటన చేశారు. ఆయన నటుడు కూడా. గతంలో తాను తీసుకున్న నిర్ణయాలను ఈ ఏకాంత సమయంలో సమీక్షించుకుంటానని అమోల్ కోల్హే చెప్పారు. మానసికి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం అవసరమని చెప్పారు. కొంత కాలం అజ్ఞాతంలో ఉంటానని పేర్కొన్నారు. కొత్త శక్తితో త్వరలోనే మళ్లీ కలుస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. 

‘అవలోకనం చేయడానికి ఇది సమయం.. గత కొద్ది రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా.. నేను ఆలోచించకుండా పరిగెత్తాను. కొన్ని తీవ్రమైన నిర్ణయాలు, ఊహించని నిర్ణయాలు తీసుకున్నాను. ఇవన్నీ చేసేటప్పుడు.. చాలా బ్యాలెన్సింగ్‌గా వ్యవహరించాల్సి వచ్చింది. టైమ్ మెనేజ్‌మెంట్ చేయాల్సి వచ్చింది. ఒత్తిడికి లోనయ్యాను. ఈ కారణం చేత నేను మానసికంగా, శారీరకంగా అలసిపోయాను. మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలంటే ధ్యానం అవసరం. గతంలో తీసుకున్న నిర్ణయాల గురించి పునరాలోచించాల్సి ఉంటుంది. అందుకోసం నేను ఏకాంతానికి వెళ్తున్నాను. త్వరలోనే కొత్త శక్తితో మిమ్మల్ని కలుస్తాను’ అని అమోల్ కొల్హేపేర్కొన్నారు. తాను రాజకీయ పార్టీలు నిర్వహించే క్యాంపులకు వెళ్లడం లేదని.. ధ్యానం కోసం వెళ్తున్నానని స్పష్టం చేశారు. 

Also read: 


2019 లోక్‌సభ ఎన్నికల్లో అమోల్ కొల్హే శివసేన అభ్యర్థి శివాజి రావ్ అధల్‌రావ్ పాటిల్‌పై విజయం సాధించారు. అయితే అంతకు ముందు అమోల్ కొల్హే శివసేన పార్టీ నేతగా కొనసాగారు. ఇక, టెలివిజన్ సీరియల్ 'స్వరాజ్యరక్షక్ శంభాజీ'లో ఛత్రపతి శంభాజీ పాత్ర, రాజా శివ్ ఛత్రపతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్ర ద్వారా పేరు తెచ్చుకున్నారు.

Also read: అనుమానిత వ్యక్తుల కదలికలు: ముఖేష్ అంబానీ వద్ద భద్రత కట్టుదిట్టం

అయితే అమోల్ కొల్హే తరుచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. కొంతకాలం క్రితం శరద్ పవార్ ఆశీస్సుల వల్లే ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించడం పెను దుమారమే రేపింది. అమోల్ కొల్హే వ్యాఖ్యలపై శివసేన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. అమోల్ కొల్హే జ్ఞాపకశక్తిని పరీక్షించాల్సిన సమయం అసన్నమైందని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయనకు స్క్రిప్ట్ చూసి డైలాగులు చెప్పడం అలవాటైందని విమర్శించింది. ఉద్దవ్ దయతోనే రాజకీయాల్లో ఉన్నాననే సంగతి ఆయన మరిచిపోయారని పేర్కొంది. 

click me!