పరాయి మగాళ్ల వద్దకు వెళ్లాలని భర్త బలవంతం.. తట్టుకోలేక భార్య ఏంచేసిందంటే..!

Published : Nov 09, 2021, 10:34 AM IST
పరాయి మగాళ్ల వద్దకు వెళ్లాలని భర్త బలవంతం.. తట్టుకోలేక భార్య ఏంచేసిందంటే..!

సారాంశం

పలార్ స్వామికి గతంలోనే పెళ్లై.. పిల్లలు ఉన్నారు. వారిని వదిలిపెట్టి... నేత్ర అనే బ్యూటీషియన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తర్వాత.. ఆమెనే పెళ్లి కూడా చేసుకున్నాడు. 

అతనికి అప్పటికే పెళ్లైంది. భార్య, పిల్లలను వదిలేసి మరో మహిళ తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయినే ఆరేళ్ల క్రితం వివాహం కూడా చేసుకున్నాడు. రెండో భార్యతో ఆనందంగా ఉంటున్నాడని అందరూ అనుకున్నారు. కానీ.. సడెన్ గా.. ఆ రెండో భార్య చేతిలోనే హతమయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also read: న్యూడిల్లీలో హైటెక్ వ్యభిచారం... వాట్సాప్ లో అమ్మాయిల ఫోటోలతో సహా రేట్ కార్డు

కర్ణాటక రాష్ట్రంలోని నెలమంగల తాలుకా మాదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ రియల్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. పలార్ స్వామి అలియాస్  స్వామిరాజ్ (50) అనే రియాల్టర్ ని.. ఆయన రెండో భార్య, బ్యూటీషీయన్ నేత్ర హత్య చేయడం గమనార్హం.

పలార్ స్వామికి గతంలోనే పెళ్లై.. పిల్లలు ఉన్నారు. వారిని వదిలిపెట్టి... నేత్ర అనే బ్యూటీషియన్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. తర్వాత.. ఆమెనే పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆమె కోసం రూ.6కోట్లు  ఖర్చు పెట్టి.. అతి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. అందులోనే ఆమెను ఉంచాడు. అయితే.. సడెన్ గా అతని రెండో భార్య నేత్ర.. పలార్ స్వామిని దారుణంగా హత్య చేసింది.

Also Read: బ్రాహ్మణులు, బనియాలు నా జేబులో ఉన్నారు.. బీజేపీ నేత మురళీధర్ రావు వ్యాఖ్యలపై వివాదం

ఆదివారం రాత్రి పలార్‌స్వామిని రాడ్‌తో కొట్టి హత్యచేసిన నేత్ర మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయింది. భర్త తనను పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేసేవాడని, అందుకే హత్య చేసానని పోలీసులకు తెలిపింది. అయితే తమను, పిల్లలను బాగా చూసుకుంటున్నాడనే కోపంతో హత్య చేసిందని మొదటి భార్య ఆరోపిస్తోంది. కేసు విచారణలో ఉంది.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్