ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కేరళలో భారీగా పెరిగిన కరోనా మృతులు

Published : Nov 09, 2021, 10:24 AM ISTUpdated : Nov 09, 2021, 10:30 AM IST
ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు: కేరళలో భారీగా పెరిగిన కరోనా మృతులు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కరోనాతో కేరళ రాష్ట్రంలో మరణించిన రోగుల సంఖ్య 262 గా నమోదైంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకు చేరింది.

న్యూఢిల్లీ: Indiaలో గత 24 గంటల్లో 10,126కొత్త Corona కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3.43 కోట్లకి చేరింది.మరో వైపు కరోనాతో 332మంది చనిపోయారు.నిన్న ఒక్క రోజే 10,85,848 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా కేసులు ఈ ఏడాది ఫిబ్రవరి ప్రారంభం నాటికి తగ్గాయని ఐసీఎంఆర్ ప్రకటించింది. 

నిన్న ఒక్క రోజే కరోనా నుండి 11,982 మంది కోలుకున్నారు. ఇప్పటివకు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 3.37కోట్లకు చేరింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1.40 లక్షలకు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 263 రోజుల కనిష్టానికి చేందరి వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. కరోనా యాక్టివ్  కేసుల రేటు 0.41గా నమోదైంది. కరోనా రోగుల రికవరీ రేటు 98.25 గా రికార్డైంది. 

Kerala రాష్ట్రంలో కరోనాతో మరణించే రోగుల సంఖ్య పెరుగుతుంది.దేశంలో నమోదైన కరోనా మరణాల్లో కేరళ రాష్ట్రం నుండే 262 రికార్డు కావడం గమనార్హం.కరోనాతో దేశంలో 4,61,389 మంది మరణించారు. ఇదిలా ఉంటే నిన్న 59 లక్షల మంది కరోనా టీకా వేయించుకొన్నారు. ఇప్పటివరకు దేశంలో 109 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారు.

ఇండియాలో 2020 ఆగష్టు 7న 20 లక్షలు, ఆగష్టు 23న 30 లక్షలు, సెప్టెంబర్ 5న 40 లక్షలు,సెప్టెంబర్ 16న 50 లక్షలకు కరోనా కేసులు చేరాయి. సెప్టెంబర్ 28న 60 లక్షలు, అక్టోబర్ 11న 70 లక్షలు, అక్టోబర్ 29న 80 లక్షలు, నవంబర్ 20న 90 లక్షల కేసులు దాటాయి.డిసెంబర్ 19న కోటి కేసులను దాటాయి.ఈ ఏడాది మే 4న  రెండు కోట్ల కేసులను దాటాయి.ఈ ఏడాది జూన్ 23న కరోనా కేసులు మూడు కోట్లను దాటాయి.

కర్ణాటక ప్రభుత్వం కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రయాణీకులు  దగ్గు, జ్వరం, గొంతు నొప్పి , శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులున్న వారి కోసం మార్గదర్శకాలను జారీ చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్