జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. రాష్ట్రంలో 77 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం..

By team teluguFirst Published Nov 11, 2022, 3:37 PM IST
Highlights

జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ వర్గాలకు అందిస్తున్న రిజర్వేషన్లు 77 శాతానికి పెంచే బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకుంది.

జార్ఖండ్ లో వివిధ వర్గాలకు కల్పిస్తున్న మొత్తం రిజర్వేషన్లను 77 శాతానికి పెంచుతూ ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. దీని కోసం ఆ ప్రభుత్వం శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో జార్ఖండ్ పోస్టులు, సేవలలో ఖాళీల రిజర్వేషన్ చట్టం- 2001కి చేసిన సవరణను అసెంబ్లీ ఆమోదించింది. దీని ప్రకారం ఎస్టీ, ఎస్సీ, ఈబీసీ, ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈబీసీ) ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 60 శాతం నుంచి 77 శాతానికి పెరగనున్నాయి.

స్వాతంత్య్ర సమరయోధుడు రఘువీర్ చరణ్ శర్మ కన్నుమూత..

రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని బిల్లు ప్రతిపాదించింది. ప్రతిపాదిత రిజర్వేషన్‌లో ఎస్సీ కమ్యూనిటీలోని స్థానిక ప్రజలకు 12 శాతం, ఎస్టీలకు 28 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులకు (ఈబీసీలు) 15 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఇతర రిజర్వ్‌డ్‌ కేటగిరీలను మినహాయించి ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా లభించనుంది.

అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో నిందితులకు ఝలక్.. బెయిల్ రద్దు చేస్తూ వారంలోగా లొంగిపోవాలని సుప్రీం ఆర్డర్.

ప్రస్తుతం జార్ఖండ్‌లో ఎస్టీలకు 26 శాతం రిజర్వేషన్లు లభిస్తుండగా, ఎస్సీలకు 10 శాతం కోటా లభిస్తోంది. ఓబీసీలు ప్రస్తుతం రాష్ట్రంలో 14 శాతం కోటాను పొందుతున్నారు. ఇలా రిజర్వేషన్లు పెంచుతామని 2019 ఎన్నికల్లో జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పాలక కూటమితో పాటు అన్ని ప్రధాన స్రవంతి పార్టీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చాయి.

కాన్పూర్ లో ఘోరం.. పొల్యూషన్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ముగ్గురు కూలీలు మృతి

కాగా.. ప్రభుత్వం ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించుకునే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. ఆయినా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేసిన రాష్ట్ర ప్రజలకు ఈ చట్టం ‘‘సురక్ష కవచ్’’ (భద్రతా కవచం) అని సీఎం హేమంత్ సోరెన్ ఈ సందర్భంగా అభిర్ణించారు. అయితే కొన్ని సవరణలు, అసెంబ్లీ కమిటీ పరిశీలన కోసం బిల్లును పంపాలన్న పలువురి సభ్యుల ప్రతిపాదనను అసెంబ్లీ తిరస్కరించింది.

click me!