బీజేపీయేతర కూటమి రావాలి, కానీ మాకు వ్యూహకర్తగా కాదు: పవార్‌తో పీకే భేటీ ఇందుకే.. ఎన్సీపీ నేత క్లారిటీ

By Siva KodatiFirst Published Jun 12, 2021, 4:18 PM IST
Highlights

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. పవార్‌ను మర్యాద పూర్వకంగానే ప్రశాంత్ కిషోర్ కలుసుకున్నారని, మూడు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారని ఆయన చెప్పారు

ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌తో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలపై ఎన్‌సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్ వివరణ ఇచ్చారు. పవార్‌ను మర్యాద పూర్వకంగానే ప్రశాంత్ కిషోర్ కలుసుకున్నారని, మూడు గంటల పాటు వీరిద్దరూ సమావేశమయ్యారని ఆయన చెప్పారు. ఎన్‌సీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ నియామకానికి సంబంధించి ఎలాంటి సంభాషణ ఇరువురి మధ్య చోటుచేసుకోలేదని తెలిపారు. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా బలమైన విపక్ష పార్టీల కూటమి ఏర్పడాలని పవార్ కోరుకుంటున్నారని, ఆ దిశగానే ఎన్‌సీపీ పనిచేస్తోందని నవాబ్ మాలిక్ స్పష్టం చేశారు.

కాగా, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమాల్ కాంగ్రెసు విజయం సాధించిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీకి కూడా పనిచేయబోనని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. కానీ ఆయన తన మనసు మార్చుకున్నారా అనే ప్రశ్న ఉదయిస్తోంది.  వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రధాని మోడీకి ధిటైన ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

Also Read:ప్రశాంత్ కిశోర్ ఆంతర్యం: శరద్ పవార్ తో లంచ్, షారూక్ ఖాన్ తో డిన్నర్

తమిళనాడులో విజయం సాధించిన స్టాలిన్ కు, పశ్చిమ బెంగాలో గెలిచిన మమతా బెనర్జీకి మద్దతు తెలిపిన నాయకులను కలిసి ధన్యావాదాలు తెలపడానికి ప్రశాంత్ కిశోర్ తన పర్యటనను ఉద్దేశించుకున్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రశాంత్ కిశోర్ పర్యటన దానికి మాత్రమే పరిమితం కాలేదని అంటున్నారు. 2024 ఎన్నికల గురించి, ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంపై వారిరువురి మధ్య చర్చలు జరుగుతాయని చెబుతున్నారు

click me!