ఢిల్లీ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం..

Published : Jun 12, 2021, 01:40 PM IST
ఢిల్లీ షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం..

సారాంశం

లాజపేట నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో శనివారం ఉదయం ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

షోరూమ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని లాజపేట్ నగర్ లో చోటుచేసుకుంది. లాజపేట నగర్ లోని సెంట్రల్ మార్కెట్ లో శనివారం ఉదయం ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఉదయం 10గంటల 20 నిమిషాల సమయంలో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. దాదాపు 16 అగ్నిమాపక యంత్రాలు సంఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలు అదుపుచేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ప్రాణ నష్టం ఏదైనా జరిగిందో లేదో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PREV
click me!

Recommended Stories

PMAY: తెలుగు ప్ర‌జ‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. 5 ల‌క్ష‌ల ఇళ్లు కేటాయింపు
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?