దేశప్రజలకు ఊరట.. కరోనా, బ్లాక్ ఫంగస్‌ మందులపై పన్ను మినహాంపు: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం

By Siva KodatiFirst Published Jun 12, 2021, 4:00 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపికబురు చెప్పింది. జీఎస్‌టీ కౌన్సిల్ పలు ప్రొడక్టులపై జీఎస్‌టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, బిపాప్ మెషీన్స్, ఆక్సిజన్ కాన్సట్రేటర్లు, వెంటిలేటర్లు, పల్స్ ఆక్సిమీటర్స్, కోవిడ్ టెస్టింగ్ కిట్స్ వంటి వాటిపై జీఎస్‌టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 
Also Read:ప్రారంభమైన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం.. వైద్యపరికరాలు, మందులపై పన్ను తగ్గింపు ఊరట లభించనుందా..!

అలాగే కరోనా చికిత్సకు ఉపయోగించే 3 మందులకు పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే బ్లాక్ ఫంగస్‌కు ఉపయోగించే మందులపైనా జీఎస్టీ తగ్గిస్తున్నట్లు వివరించింది. జీఎస్‌టీ కౌన్సిల్ 44వ మీటింగ్‌ అనంతరం సమావేశ వివరాలను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వివరించారు. ఆయా వస్తువులపై జీఎస్‌టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. 
 
click me!