Navratri Special: రూ. 8 కోట్ల కరెన్సీ నోట్లతో 135 ఏళ్ల నాటి ఆలయం అలంకరణ

By Mahesh Rajamoni  |  First Published Oct 4, 2022, 4:59 PM IST

Navratri special: 135 ఏళ్ల నాటి వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నవరాత్రుల సంద‌ర్భంగా ఎనిమిది కోట్ల రూపాయ‌ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఆలయ గోడలు, నేలపై కరెన్సీ నోట్లను ఉంచారు. క‌రెన్సీ నోట్ల‌తో ఉన్న దండ‌ల‌ను కూడా వేశారు. 
 


Kanyaka Parameswari temple: ద‌స‌రా నవరాత్రి వేడుక‌ల‌ను భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో ఎంతో ఘ‌నంగా.. వైభవంగా.. ఉల్లాసంగా జరుపుకుంటారు. నవరాత్రి ప్రారంభంతో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. ఇది సంవత్సరం చివరి వరకు కొనసాగుతుంది. అయితే, న‌వ‌రాత్రి సంద‌ర్భంగా అమ్మ‌వారి అలంక‌ర‌ణ‌ల చాలా ప్రాంతాల్లో చాలా ప్ర‌త్యేకంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే పవిత్రమైన నవరాత్రుల సందర్భంగా 135 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఆల‌యం లోప‌ల ఎటూ చూసిన అమ్మ‌వారి విగ్ర‌హం.. క‌రెన్సీ నోట్లో క‌నిపిస్తున్నాయి. దీనిని చూడ‌టానికి పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు, భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ ఆలయమే విశాఖపట్నంలో  ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాల‌యం. 

వివ‌రాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని 135 ఏళ్ల నాటి ఆలయాన్ని నవరాత్రుల కోసం రూ.8 కోట్ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. నవరాత్రులలో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బంగారు ఆభరణాలు, అన్ని రకాల కరెన్సీ నోట్లతో అలంకరించారు. దేవతను రూ. 8 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. అక్క‌డ ఉంచిన కరెన్సీ అంతాకూడా ప్రజల సొమ్ము కావడం విశేషం. "ఇది ప్రజల సహకారం & పూజ ముగిసిన తర్వాత తిరిగి ఇవ్వబడుతుంది. ఇది ఆలయ ట్రస్ట్‌కు వెళ్లదు" అని ఆలయ కమిటీ అధికారులు తెలిపారు.  

Latest Videos

undefined

దాదాపు ఎనిమిది కోట్ల రూపాయ‌ల విలువైన కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో అలంకరించారు. ఆలయ గోడలు, నేలపై కరెన్సీ నోట్లను ఉంచారు. క‌రెన్సీ నోట్ల‌తో ఉన్న దండ‌ల‌ను సైతం కూడా వేశారు. రూ.2000, రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.10 నోట్లతో ఆలయాన్ని అలంకరించేందుకు వందలాది మంది వాలంటీర్లు నిద్రలేని రాత్రులు గడిపార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. వివిధ రకాల కరెన్సీ నోట్లతో రంగురంగుల‌ పూలమాలలు, పుష్పగుచ్ఛాలు కూడా తయారు చేశారు. వివిధ రంగుల కరెన్సీ నోట్లు ఆలయ అందాన్ని మరింత పెంచాయి. ప్రత్యేక అలంకరణ వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులను ఆకర్షించింది.

కాగా, నవరాత్రి ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని పూజిస్తారు. అయితే, ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించడం ఇదే మొదటిసారి కాదు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు.  ప్రతియేటా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని కరెన్సీ నోట్లతో అకరించి ఆరాధించడం ఆనవాయితీగా వస్తోందని ఆల‌య క‌మిటీ స‌భ్యులు తెలిపారు. 2017లో ఆలయ కమిటీ 3 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో ఇదే విధమైన ఏర్పాటులో నైవేద్యాన్ని సమర్పించింది. అదేవిధంగా, విశాఖపట్నంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2018లో రూ.4.5 కోట్ల నగదు, బంగారు ఆభరణాలతో ఆల‌యాన్ని అలంక‌రించారు. 

click me!