ఎఫ్ఎమ్ రేడియో ఫేజ్-3 పాలసీ మార్గదర్శకాల్లో సవరణలకు ప్రభుత్వ ఆమోదం

By Mahesh RajamoniFirst Published Oct 4, 2022, 3:55 PM IST
Highlights

FM Phase-III guidelines: ప్ర‌యివేటు ఎఫ్ఎమ్ రేడియో ఫేజ్-3 పాల‌సీ మార్గ‌ద‌ర్శ‌కాల్లో స‌వ‌ర‌ణ‌ల‌కు ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో ఈ రంగంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పాలనను మరింత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా ఉండేలా చేయడానికి, దాని ప్రయోజనాలు సామాన్యులకు చేరేలా చేయడంలో మెరుగైన ఫ‌లితాలు ఉంటాయ‌నే అభిప్రాయాలను వ్యక్తం చేసింది.

Private FM Phase-III guidelines: ప్ర‌యివేటు ఎఫ్.ఎమ్ ఫేజ్-3 పాలసీ గైడ్ లైన్స్ అని పిలువబడే ప్ర‌యివేటు ఏజెన్సీలు (ఫేజ్- III) ఎఫ్.ఎమ్ రేడియో ప్రసార సేవలను పొడిగించడంపై పాలసీ మార్గదర్శకాల్లో ఉన్న కొన్ని నిబంధనల సవరణలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన గత కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నార‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ఈ స‌వ‌ర‌ణ‌లు ఒకసారి అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా ఎఫ్ఎం రేడియో సేవ‌ల‌ను విస్తరించడం మ‌రింత‌ సులభం అవుతుంది.

ఈ దిశలో,15 సంవత్సరాల లైసెన్స్ వ్యవధిలో అదే నిర్వహణ సమూహంలో ఎఫ్.ఎమ్ రేడియో లైసెన్స్‌ల ను పునర్నిర్మించడానికి 3 సంవత్సరాల విండో వ్యవధిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఛానల్ హోల్డింగ్స్‌పై 15% జాతీయ పరిమితిని తొలగించాలనే రేడియో పరిశ్రమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం ఆమోదించింది. ఎఫ్.ఎమ్ రేడియో పాలసీలో ఆర్థిక అర్హత నిబంధనలను సరళీకృతం చేయడంతో, దరఖాస్తుదారు కంపెనీలు ఇప్పుడు సీ, డీ కేటగిరీ నగరాల కోసం వేలంపాటలో పాల్గొనవచ్చు. అయితే, దీని నికర విలువ ఇంతకు ముందున్న రూ. 1.5 కోట్లు కాకుండా  కేవలం రూ. 1 కోటిగా నిర్ణయించింది. దీంతో ఈ రంగంలో మ‌రిన్ని పెట్టుబ‌డుల రావ‌చ్చు అనే అభిప్రాయం వ్యక్త‌మ‌వుతోంది.  

ఈ మూడు సవరణలు కలిసి  ప్ర‌యివేటు ఎఫ్‌ఎమ్ రేడియో పరిశ్రమ ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రభావితం చేయడంలో సహాయపడతాయ‌ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. దేశంలోని టైర్-III నగరాలకు ఎఫ్‌ఎమ్ రేడియోను, వినోదాన్ని మరింత విస్తరించడానికి మార్గం సుగమం చేస్తుంద‌ని తెలిపింది. ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా ఎఫ్.టీ.ఏ (ఫ్రీ టూ ఎయిర్) రేడియో మాధ్యమం ద్వారా సంగీతం, వినోదం దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూస్తుందని కూడా పేర్కొంది. 

దేశంలో ఈరంగంలో వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి, పాలనను మరింత సమర్ధవంతంగా, ప్రభావవంతంగా ఉండేలా చేయడానికి, దాని ప్రయోజనాలు సామాన్యులకు చేరేలా చేయడానికి ఇప్పటికే ఉన్న నిబంధనలను సరళీకరించడంతో పాటు హేతుబద్ధీకరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపింది. 

తాజా స‌వ‌ర‌ణ‌ల‌తో ప్ర‌యోజ‌నాలేంటి?

  • దేశంలోని టైర్-III నగరాల్లో ఎఫ్ఎం రేడియో విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. 
  • ఈ రంగంలో వ్యాపార సౌలభ్యం మ‌రింత మెరుగుప‌డుతుంది. 
  • కొత్త ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో యువత ప్రయోజనం పొందుతుంది.

ఈ స‌వ‌ర‌ణ‌ల్లోని మూడు ప్రధాన మార్పులు ఇవే.. 

  • ఎఫ్.ఎమ్ రేడియో లైసెన్స్‌ల ను పునర్నిర్మించడానికి 3 సంవత్సరాల విండో వ్యవధి విధానం ముగుస్తుంది. 
  • జాతీయ పరిమితి 15 శాతం ఉండాలనే నిబంధన రద్దు చేయబ‌డింది. 
  • సీ, డీ కేటగిరీ నగరాలకు కూడా బిడ్డింగ్ చేయవచ్చు. 
 

Government approves amendments of certain provisions contained in the Policy Guidelines on Expansion of FM Radio Broadcasting Services through Private Agencies (Phase-III)

Read details: https://t.co/pLNSZllghb

1/2 pic.twitter.com/RYiLHICynY

— PIB India (@PIB_India)
click me!