మూడోసారి కూడా మోదీయే ప్రధాని ... ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

Published : Jun 05, 2024, 01:34 PM ISTUpdated : Jun 05, 2024, 01:42 PM IST
మూడోసారి కూడా మోదీయే ప్రధాని ... ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్..

సారాంశం

భారత ప్రధాానిగా మరోసారి నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్డిఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావడంతో మరోసారి మోదీ బాద్యతలు చేపట్టున్నారు.

న్యూడిల్లి : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టనున్నారు. గతంతో పోలిస్తే బిజెపికి సీట్లు తగ్గినప్పటికి ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మ్యాజిక్ ఫిగర్ ఎన్డిఏ వద్ద వుంది. దీంతో మరోసారి నరేంద్ర మోదీ ప్రధాని కానున్నారు. ఈ మేరకు బిజెపితో పాటు ఎన్డిఏ పక్షాలు మోదీనే ప్రధానిని చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్ 8న అంటే వచ్చే శనివారం ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసారు. 

లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డిఏ 294 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధించింది. బిజెపి 241 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది... కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పరిస్థితి లేదు. దీంతో ఎన్డిఏలోని మిత్రపక్షాల సహకారంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తోంది. దీంతో దేశంలో మరో ఐదేళ్లు మోదీ 3.O పాలన సాగనుంది. 

ఇక కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండి కూటమి కూడా లోక్ సభ ఎన్నికల్లో మంచి సీట్లు సాధించింది. కానీ ఎన్డిఏ కూటమిని మాత్రం ఓడించలేకపోయింది. ఇండి కూటమికి 234 సీట్లు వచ్చాయి....మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా వచ్చింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు తగిిన బలం సాధించలేదు. దీంతో ఎన్డిఏ కూటమి మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు చేయనుంది... నరేంద్ర మోదీ ప్రధాని కానున్నారు. 

 

 

  

 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal flash flood | నేపాల్‌లో వరద బీభత్సం వందల మంది గల్లంతు | Trishuli River Flood
దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM