వారణాసి అప్‌డేట్‌: హమ్మయ్యా.. లీడ్‌లోకి మోదీ

Published : Jun 04, 2024, 10:30 AM IST
వారణాసి అప్‌డేట్‌: హమ్మయ్యా.. లీడ్‌లోకి మోదీ

సారాంశం

కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై ప్రధాని మోదీ రెండో రౌండ్‌లో 436 ఓట్ల లీడ్‌లోకి వచ్చారు. దీంతో మొదటి రౌండ్‌ ఫలితాలతో షాక్‌ తిన్న మోదీ అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.

వారణాసి లోక్‌సభ స్థానంలో తొలి రౌండ్‌లో వెనుకబడిపోయిన ప్రధాని మోదీ... కాస్త పుంజుకున్నారు. రెండో రౌండ్‌లో స్వల్ప ఆధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌ రాయ్‌పై ప్రధాని మోదీ రెండో రౌండ్‌లో 436 ఓట్ల లీడ్‌లోకి వచ్చారు. దీంతో మొదటి రౌండ్‌ ఫలితాలతో షాక్‌ తిన్న మోదీ అభిమానులు, బీజేపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక.. ఈ ఆధిక్యం అంతే కంటిన్యూ అవుతుందని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అంతేకాదు.. మూడో సారి ప్రధాని పీఠాన్ని అధిరోహించి.. జవహర్ లాల్ నెహ్రూ రికార్డును నరేంద్రమోదీ సమం చేసేలా కనపడుతున్నారు. మూడు సార్లు  నెహ్రూ  పీఎం అవ్వగా.. ఇప్పుడు మోదీ కూడా ఆ రికార్డును చేరుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు. అవకాశాలు కూడా అందుకు మెండుగా ఉండటం విశేషం.

 ఇక, ఇండియా కూటమి నామమాత్రపు సీట్లకు పరిమితం అవుతుంటే.. రాహుల్‌ గాంధీ పోటీ చేసిన రాయ్‌బరేలి, వయనాడ్‌ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. రాహుల్ మాత్రం పోటీ చేసిన రెండు నియోజక వర్గాల్లో విజయం సాధించేలా కనపడుతున్నారు.  కాగా.. అధికారం మాత్రం మళ్లీ ఎన్డీయే కూటమికే దక్కనుందని తెలుస్తోంది.  ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిందే  నిజం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్