అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ . అయోధ్య ధామ్‌లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని, ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులతో టౌన్‌షిప్‌లు నిర్మించామని మోడీ వెల్లడించారు.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ . అయోధ్య పర్యటనలో వున్న ప్రధాని మోడీ.. శనివారం నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం మోడీ ప్రసంగిస్తూ.. అయోధ్య ఎయిర్‌పోర్టుకు త్రికాలదర్శి అయిన మహర్షి వాల్మీకి పేరు పెట్టామని, రోజుకు 10 లక్షల మందికి సేవలు అందించేలా దీనిని నిర్మించామని మోడీ తెలిపారు. అయోధ్య ధామ్‌లో ఎక్కడ చూసినా రామనామం వినిపించాలని, ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులతో టౌన్‌షిప్‌లు నిర్మించామని మోడీ వెల్లడించారు.
హిందుస్థాన్ చరిత్రలో జనవరి 22 ఓ విశిష్టమైన రోజుగా నిలుస్తుందని, ఆ రాత్రి ప్రతి ఇంట్లో రామజ్యోతిని వెలిగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఒకప్పుడు రామ్ లల్లా టెంట్‌లో వుండాల్సిన పరిస్ధితి నెలకొందని, ఇప్పుడు ఆయన అత్యంత సుందరమైన ఇంటిని నిర్మించామని మోడీ వెల్లడించారు. ఆలయాల పునర్నిర్మాణాలతో పాటు అభివృద్ధిలోనూ భారత్ దూసుకుపోతోందన్నారు.
ఇప్పుడు రాముడి కోసం పెద్ద మందిరం సిద్ధమైందని, మొత్తం యూపీ అభివృద్ధికి అయోధ్య స్పూర్తిగా మారుతుందని మోడీ ఆకాంక్షించారు. దేశంలోని ముఖ్య నగరాల్లో వందే భారత్ రైళ్లు తిరుగుతున్నాయని, త్వరలో మరిన్ని నగరాలకు వందే భారత్ రైళ్లు విస్తరిస్తామని ప్రధాని తెలిపారు. అభివృద్ధి చెందాలంటే వారసత్వాన్ని కాపాడుకోవాలని, వారసత్వం మనకు సరైన మార్గాన్ని చూపిస్తుందని మోడీ చెప్పారు.
సరయూ తీరంలో కొత్త ఘాట్‌ల నిర్మాణం జరుగుతోందని..అయోధ్యకు వచ్చే ప్రతి రామభక్తుడికి దర్శనం సులువుగా లభించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రధాని తెలిపారు. 500 ఏళ్లు రాముడి ఆలయం కోసం పోరాడమని , అసంఖ్యాకమైన అతిథుల కోసం అయోధ్య ప్రజలు సిద్ధంగా వుండాలని మోడీ పేర్కొన్నారు. తొలి అమృత్ భారత్ రైలు అయోధ్య నుంచి ప్రయాణిస్తోందని ప్రధాని చెప్పారు.