ప్రధాని మోదీకి ఇంటా బయటా ఫుల్ క్రేజ్ ఉంది. భారత్ తో పాటు విదేశాల్లోనూ ఆయనకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉంది. వరుసగా పదేళ్లపాటు ప్రధానిగా పనిచేసిన మోదీ... మూడోసారి అధికార పీఠం అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. వారణాసిలో మూడోసారి మోదీ గెలుపుపై అన్నీ శుభ శకునాలే కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది... అదేంటంటే...
ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. అమెరికా గానీ, మరే విదేశీ పర్యటనకు వెళ్లినా అక్కడ ప్రవాస భారతీయులు ఆయనకు బ్రహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనం. 2024 లోక్ సభ ఎన్నికల్లో మోదీ మూడోసారి గుజరాత్ రాష్ట్రంలోని వారణాసి పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన నేపథ్యంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. వారిణాసి మోదీ మళ్లీ గెలిస్తే కస్టమర్లకు ఫ్రీగా మేతీ గోటా/ మేతీ పకోడా (మెంతికూరతో చేసిన స్నాక్స్- ఉత్తరాదిలో బాగా ఫేమస్) స్నాక్స్ అందిస్తామని ప్రకటిచింది. అమెరికాలోని న్యూ జెర్సీలో 20 సంవత్సరాలుగా రెస్టారెంట్ నిర్వహిస్తున్న ఇండియన్ ఫ్యామిలీ.... 2014, 2019లోనూ ఇలాగే ఫ్రీ ఆఫర్ ఇచ్చింది. 2014లో 8వేల మందికి, 2019లో 10వేల మందికి ఉచితంగా పకోడీ సర్వ్ చేసింది. ఈసారి మోదీ గెలిస్తే అంతకుమించి ఫ్రీగా స్నాక్స్ అందిస్తామని చెబుతున్నారు. ఇదంతా ఎందుకంటే... ప్రధాని మోదీ పనితీరు బాగుండటం వల్లేనని చెబుతున్నారు రెస్టారెంటు యజమానులు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నది తప్ప.. మరే ఇతర ఉద్దేశమూ ఈ ఫ్రీ ఆఫర్ వెనుక లేదంటున్నారు.....
నరేంద్ర మోదీ.. సాధారణ కార్యకర్త నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు. 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన వ్యక్తిగా మోదీ రికార్డుకెక్కారు. ఆ తర్వాత 2014లో వారణాసి లోక్ సభ స్థానం నుంచి గెలిచి ప్రధాన మంత్రి అయ్యారు. 2019లోనూ అదే స్థానం నుంచి ఎన్నికై రెండోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. మూడోసారి కూడా వారణాసి నుంచే పోటీ చేసి... హ్యాట్రిక్ విజయం అందుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఇదే విషయాన్ని వెల్లడించాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. భారత్ తో పాటు విదేశాల్లోనూ మోదీకి పెద్ద ఎత్తున ఫాలోయింగ్. 2014 నుంచి ఇప్పటి వరకు పదేళ్ల పాటు భారత ప్రధాన మంత్రిగా కొనసాగిన మోదీ.. అనేక విదేశీ పర్యటనలు చేశారు. ఏ దేశానికి అక్కడున్న భారతీయులను కచ్చితంగా కలుస్తారు. భారత్ ప్రగతికి ఎన్ఆర్ఐల సహకారాన్ని, అవసరాన్ని వివరిస్తారు. అదే విధంగా ప్రధాని మోదీ పర్యటనలంటే ప్రవాస భారతీయులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. విదేశీ పర్యటనలకు మోదీ వెళ్లినప్పుడు ప్రవాసులు అపూర్వ స్వాగతం పలికిన అనేక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
కాగా, దేశంలో ఎన్డీయే అత్యధిక స్థానాలతో మళ్లీ అధికారం దక్కించుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇండియా కూటమి 150 సీట్లకు పరిమితం అవుతుందని వెల్లడించాయి...