ముఖానికి మాస్క్ పెట్టుకోలేదని.. కాళ్లల్లో మేకులు దించి..!

By telugu news teamFirst Published May 27, 2021, 7:28 AM IST
Highlights

మాస్క్ ధరించలేదని కాళ్లకు, చేతులకు మేకులు దించారు. కాగా.. బాధితుడి తల్లి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. మాస్క్ ధరించడం నిజంగానే తప్పనిసరి. మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేయక తప్పదు. అయితే.. కొందరు ఏ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారి పట్ల పలు ప్రాంతాల్లో పోలీసులు సైతం మరింత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా.. మాస్క్ పెట్టుకోలేదని ఓ వ్యక్తి కాళ్లకు ఏకంగా మేకులు దించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీలోని బరాదరీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. మాస్క్ ధరించలేదని కాళ్లకు, చేతులకు మేకులు దించారు. కాగా.. బాధితుడి తల్లి పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మే 24వ రాత్రి 10గంటల సమయంలో తాను తన కుమారుడు ఇంటి ముందు ఆవరణలో కూర్చున్నామని.. అప్పుు అక్కడకు ముగ్గురు స్థానిక పోలీసులు వచ్చారని ఆమె చెప్పింది. మాస్క్ ఎందుకు ధరించలేదని.. పోలీసులు తమను ప్రశ్నించారని..ఈ క్రమంలో పోలీసులకు తన కుమారుడికి వాగ్వాదం చోటుచేసుకుందని ఆమె ఆరోపించారు. ఆ తర్వాత కాళ్లకు, చేతులకు మేకులు కొట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తమ కుమారుడికి న్యాయం చేయాలని ఆమె పోలీసులు ఉన్నతాధికారులను వేడుకున్నారు. ఇదిలా ఉండగా.. సదరు వ్యక్తిపై పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని.. వాటి నుంచి తప్పించుకోవడానికి తల్లీ, కొడుకులు డ్రామాలు ఆడుతున్నారని పోలీసులు చెబుతుండటం గమనార్హం. 

click me!