3 లక్షల ఇళ్లు ధ్వంసం, లక్షలాది ఎకరాల పంట నష్టం : బెంగాల్‌‌కు కడగండ్లు మిగిల్చిన యాస్

By Siva KodatiFirst Published May 26, 2021, 10:30 PM IST
Highlights

యాస్‌ తుపాను తూర్పు తీరాన్ని వణికిస్తోంది. దీని వల్ల పశ్చిమ బెంగాల్‌కు అపార నష్టం కలిగిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ. తుపాను దాదాపు కోటి మందిపై ప్రభావం చూపినట్టు సీఎం వివరించారు. 

యాస్‌ తుపాను తూర్పు తీరాన్ని వణికిస్తోంది. దీని వల్ల పశ్చిమ బెంగాల్‌కు అపార నష్టం కలిగిందన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ. తుపాను దాదాపు కోటి మందిపై ప్రభావం చూపినట్టు సీఎం వివరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలను అనుసరించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 15 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. కానీ భారీస్థాయిలో ఆస్తి నష్టం తప్పలేదని మమత ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం యాస్‌ తుపాను వల్ల రాష్ట్రంలో ఒకరు మరణించగా, సుమారు 3 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయని మమతా బెనర్జీ అన్నారు. తుపాను తీవ్రత ఎక్కువగా ఉన్న పశ్చిమ మిడ్నాపూర్, దక్షిణ, ఉత్తర పరగణాల జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇప్పటికే తుపాను ప్రభావిత ప్రాంతాలకు కోటి రూపాయల విలువైన సహాయక సామగ్రిని తరలించినట్లు మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఇక తుపాను తీరం దాటిన ఒడిషాలోనూ నష్టం భారీగానే వుంది. దమ్రా, దక్షిణ బహనాగా ప్రాంతాల్లో అపార నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. 

Also Read:ధమ్రా వద్ద తీరాన్ని తాకిన యాస్ తుఫాన్: ఒడిశా, బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

మరోవైపు పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్‌ తుపాను తీరం దాటడంతో తీవ్రత అధికంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రం గతంలో ఎన్నడూ లేనంత అల్లకల్లోలంగా మారిందని.. రెండు మీటర్ల ఎత్తులో రాకాసి అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. ఒడిషా, బెంగాల్‌ తీరంలో సముద్రం చాలా చోట్ల పది మీటర్ల వరకు ముందుకు వచ్చింది

click me!