
నాగపూర్ : మహారాష్ట్ర Nagpur లోని Rashtriya Swayamsevak Sangh ప్రధాన కార్యాలయం రెక్కీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను సిఆర్పిఎఫ్, జమ్మూకాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ Jaish-e-Mohammedకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్లు నాగ్పూర్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. తాజాగా ఈ కేసుకు సంబంధించి జమ్మూకాశ్మీర్ కు చెందిన నలుగురు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు.
ఆర్ఎస్ఎస్ కార్యాలయంతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు జమ్మూకాశ్మీర్ కు చెందిన ఓ యువకుడిని అరెస్టు చేయగా.. నాగపూర్ లో రెక్కీ విషయం తెలిసిందని వివరించారు.
సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా సిఆర్పిఎఫ్ జమ్మూకాశ్మీర్ పోలీసులు మరో నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారని పేర్కొన్నారు. నిందితులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు Amitesh Kumar వెల్లడించారు.
కాగా, జనవరి 8న ఈ రెక్కీ విషయం మహారాష్ట్రలో కలకలం రేపింది. దీంతో మహారాష్ట్ర Nagpurలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. Rashtriya Swayamsevak Sangh హెడ్ క్వార్టర్స్‌తో పాటు, హెడ్గేవార్ భవన్ వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా నాగ్‌పూర్‌లో పలు సున్నితమైన ప్రాంతాల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టుగా పోలీసులకు సమాచారం అందింది.
ఈ క్రమంలోనే జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకు చెందిన గుర్తు తెలియని వ్యక్తులపై కొత్వాలి పోలీసులు.. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం Nagpur క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
‘నాగ్‌పూర్‌లోని కొన్ని ప్రదేశాలలో కొంతమంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు మాకు సమాచారం అందింది. మేము చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద కేసు నమోదు చేశాం. ఈ ఘటనను క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది’ అని నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ తెలిపారు. ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి ఫోటోగ్రఫీ, డ్రోన్‌లను ఎగురవేయకుండా అదనపు భద్రతను మోహరించినట్లు అమితేష్ కుమార్ తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించాడని ఆయన నిరాకరించారు.
జమ్మూకశ్మీర్‌లో నివసిస్తున్న ఒక యువకుడు జూలై 2021లో నాగ్‌పూర్‌కు వచ్చి కొంతకాలం అక్కడే ఉన్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మమమ్మద్ సూచన మేరకు నాగ్‌పూర్‌లోని సంఘ్ కార్యాలయంలో రెక్కీ నిర్వహించేందుకు ప్రయత్నించి ఉంటాడని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇక, ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో.. పోలీసులు ఆరెస్సెస్ కార్యాలయం, Hedgewar Bhavanతో పాటు పలు సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.