Emergency landing అయిన ఎయిర్ ఏషియా విమానం.. అస‌లేం జ‌రిగింది?

Published : Jan 09, 2022, 10:43 PM IST
Emergency landing అయిన ఎయిర్ ఏషియా విమానం.. అస‌లేం జ‌రిగింది?

సారాంశం

Emergency landing: రాంచీ నుంచి చెన్నై బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం వైద్య కారణాల వల్ల ఆదివారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు అధికారులు తెలిపారు.

Emergency landing: ఎయిర్​ ఏషియా విమానం భువనేశ్వర్​లో అత్యవసర ల్యాండింగ్​ అయింది. ఝార్ఖండ్​లోని రాంచీ నుంచి చెన్నై వెళ్తున్న ఎయిర్ ​ఏషియా విమానం అత్యవసర ల్యాండింగ్​ అయ్యింది. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు లోను కావ‌డంతో.. ఒడిశా భువనేశ్వర్​లోని బిజు పట్నాయక్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్​ చేసినట్లు ఎయిర్​పోర్ట్​ వర్గాలు తెలిపాయి.

వివ‌రాల్లోకెళ్తే.. ఎయిర్ ఏషియాకు చెందిన ఐఏడీ 1631ఏ320 విమానం రాంచీ ఎయిర్​ పోర్ట్​ నుంచి చెన్నైకి బయలుదేరింది. ఈ క్రమంలో బసంత్​ కుమార్​ పాశ్వాన్  (40)​ అనే ప్ర‌యాణీకుడు  తీవ్ర‌​ అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని సిబ్బందికి తెలియ‌జేయ‌డంతో విమానాన్ని భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్​ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించి.. అక్క‌డ ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. రాత్రి  7 గంటల 26 నిమిషాల ప్రాంతంలో విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేసిన‌ట్టు అధికారులు పేర్కొన్నారు. 
 
అనంత‌రం..  బసంత్ కుమార్ పాశ్వాన్ ని చికిత్స కోసం భువనేశ్వర్​లోని క్యాపిటల్ హాస్పిటల్‌కుతరలించినట్లు అధికారులు తెలిపారు.  అతనితో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా దిగారని అధికారి తెలిపారు.ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే