Covid Vaccination Certificates: మోదీ ఫొటో లేకుండానే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌..! ఎందుకంటే?

Published : Jan 10, 2022, 06:08 AM IST
Covid Vaccination Certificates: మోదీ ఫొటో లేకుండానే వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌..! ఎందుకంటే?

సారాంశం

Covid Vaccination Certificates: అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో కనిపించకుండా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను జారీ చేయనుంది. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో ఆ మేరకు మార్పులు చేయనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా మరియు మణిపూర్‌లలో ఎన్నిక‌ల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో  ఈ రాష్ట్రాల్లోని కోవిడ్ -19 వ్యాక్సిన్ సర్టిఫికేట్ల నుండి ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోను తొల‌గించాల‌ని  కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.  

Covid Vaccination Certificates: కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌పై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో క‌నిపించ‌దు. ప్ర‌ధాని ఫోటో తొల‌గించి.. స‌ర్టిఫికేట్స్ ను జారీ చేయ‌నున్నారు. ఎందుకు ప్ర‌ధాని మోడీ తొల‌గించ‌బోతున్నర‌ని భావిస్తున్నారా?  దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ప‌లు రాష్ట్రాల్లో ఎల‌క్ష‌న్ కోడ్ అమ‌ల్లో ఉంది. దేశంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జారీ అయ్యే కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లపై మోదీ ఫొటో కనిపించకుండా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లను జారీ చేయనుంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఎన్నికల కమిషన్‌ ప్రకటనతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకోసం CoWIN పోర్టల్‌లో అవసరమైన ఫిల్టర్లను కేంద్ర ఆరోగ్య శాఖ వినియోగించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి

 ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ రాష్ట్రాల్లో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు విడతల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో ప్రభుత్వాలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు మోడల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది.
 
 దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా ఆయా రాష్ట్రాల్లో ప్రధాని మోదీ ఫొటో లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఇందుకోసం కొవిన్‌ పోర్టల్‌లో అవసరమైన ఫిల్టర్లను కేంద్ర ఆరోగ్య శాఖ వినియోగించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 2021 మార్చిలో ఈ విష‌యంపై గతంలో కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలియ‌జేశాయి.  దీంతో అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, పుదుచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ సూచనల మేరకు ఇదే తరహాలో మోదీ ఫోటో లేకుండా సర్టిఫికెట్‌ను జారీ చేసిన విష‌యం తెలిసిందే. 
  
జనవరి 15 వరకు ఎన్నికల ర్యాలీలపై నిషేధం

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఏడు దశల్లో ఓటింగ్‌ పూర్తి చేసి ఫిబ్రవరి 10న ప్రారంభమై చివరి దశ పోలింగ్‌ మార్చి 7న నిర్వహించనున్నారు. మరోవైపు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలలో ఒకే దశలో ఫిబ్రవరి 14న పోలింగ్ జరగనుంది. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న రానున్నాయి.

ఈ కమిషన్ ప్రకటనతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్, గోవాలలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ మరియు దాని కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల దృష్ట్యా, ఎన్నికల సంఘం డిజిటల్ మార్గాల ద్వారా ప్రచారం చేయాలని నొక్కి చెప్పింది . అలాగే భద్రత దృష్ట్యా, ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి ఎలాంటి ర్యాలీ లేదా బహిరంగ సభను నిర్వహించకూడదని చెప్పింది. జనవరి 15 వరకు రోడ్ షోలు, పాదయాత్రలు లేదా సైకిల్ లేదా బైక్ ర్యాలీలు లేదా వీధి సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించబడవు.
 

PREV
click me!

Recommended Stories

Codeine Syrup Case : అసెంబ్లీలో దద్దరిల్లిన దగ్గుమందు చర్చ
World Highest Railway Station : రైలు ఆగినా ఇక్కడ ఎవరూ దిగరు ! ప్రపంచంలో ఎత్తైన రైల్వే స్టేషన్ ఇదే