విదేశాల్లో పెట్టుబడులతో అధికరాబడులంటూ.. నాగ్‌పూర్ వ్యాపారిని రూ. 5.39 కోట్లు మోసం చేసిన ముఠా...

By SumaBala Bukka  |  First Published Oct 10, 2023, 7:11 AM IST

బొగ్గు వ్యాపారి అంకుర్‌కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి ధంతోలి పోలీస్ స్టేషన్‌లో తాను కోట్ల రూపాయలు మోసపోయినట్టు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్థిక నేరాల విభాగం అధికారులు తెలిపారు.


నాగ్‌పూర్ : విదేశాల్లో పెట్టుబడులు పెడితే అధిక రాబడి వస్తుందని నమ్మించిన 18 మంది వ్యక్తుల ముఠా నాగ్‌పూర్‌కు చెందిన ఒక వ్యాపారిని రూ. 5.39 కోట్లు మోసం చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. బాధితుడు బొగ్గు వ్యాపారి అంకుర్‌కుమార్ అగర్వాల్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ధంతోలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని దర్యాప్తు ప్రారంభించినట్లు ఆర్థిక నేరాల విభాగం అధికారి తెలిపారు.

"అగర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం, మందార్ కోల్టే అనే ఓ వ్యక్తి ముందుగా అతడిని కలిశాడు. విదేశాలలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయనే ప్లాన్ తో  అతన్ని ఆకర్షించాడు. ఈ పథకంలో కోల్టేకు 17 మంది సహాయం అందించారు, వారిలో ఎక్కువ మంది ముంబైకి చెందినవారు. అతనిని పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించడానికి సమావేశాల కోసం.. అగర్వాల్‌ను వివిధ ఫైవ్ స్టార్ హోటళ్లకు కూడా తీసుకెళ్లారు" అని అధికారి తెలిపారు.

Latest Videos

క్రికెట్ చూస్తుండగా.. పేలిన ఫ్రిజ్డ్‌.. ఐదుగురు మృత్యువాత..

"బాధితుడు పెట్టుబడి పథకం ప్రకారం నిందితుడి వివిధ బ్యాంకు ఖాతాలకు రూ. 5.39 కోట్లను బదిలీ చేశాడు. అయితే, కొద్దికాలానికే అతను మోసపోయాడని వెంటనే గ్రహించాడు. నిందితుడు అతనికి ఇచ్చిన డిమాండ్ డ్రాఫ్ట్ కూడా నకిలీ అని తేలింది" అని అతను చెప్పాడు. మోసం, వంచన, నేరపూరిత నమ్మక ద్రోహం, ఇతర నేరాలకు సంబంధించి 18 మందిపై ఇండియన్ పీనల్ కోడ్ కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ జరుగుతోందని అధికారి తెలిపారు.

click me!