ఓ చెరువులోని బురదలో కూరుకుపోయారు నాగాలాండ్ కు చెందిన మంత్రి. అలాంటి పరిస్థితుల్లో కూడా జోకులు పేలుస్తూ.. పరిస్థితిని తేలిక చేయడానికి ప్రయత్నించారు.
నాగాలాండ్ : నాగాలాండ్ మంత్రి, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ తన ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆయన ఇటీవల ఒకచోట బురద గుంటలో ఇరుక్కుపోయారు. ఇద్దరు సహాయకులు ఆయనను అతి కష్టం మీద బైటికి తీశారు. టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ చాలా సమస్యాత్మక సందర్భాల్లో కూడా జోకులు పేలుస్తుంటారు.
అలా ఈ సందర్బంలో కూడా జోకులు పేల్చారు. ‘చెరువులో నేనే అతిపెద్ద చేపలాగా ఉన్నాను’ అని అంటూ కామెంట్స్ చేశారు. దీంతో చుట్టూ ఉన్నవారంతా నవ్వులే నవ్వులు. ఈ వీడియోను షేర్ చేస్తూ “ఆజ్ JCB కా టెస్ట్ థా! అంటూ.. గమనిక : అంటూ.. ఇదంతా NCAP రేటింగ్, బండి కొనడానికి ముందు NCAP రేటింగ్ తప్పకుండా చూడడం మరిచిపోవద్దు’ అంటూ చెప్పుకొచ్చారు.
undefined
ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 'హార్ కర్ జీత్నే వాలే కో...' అంటూ ఈ నాగాలాండ్ మంత్రి తెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్‌టాకీ నియోజకవర్గం గెలిచిన తర్వాత షారూఖ్ ఖాన్ 'బాజీగర్' డైలాగ్‌ను చెప్పడం అప్పట్లో వైరల్ అయ్యింది.
Aaj JCB ka Test tha !
Note: It's all about NCAP Rating, Gadi Kharidney Se Pehley NCAP Rating Jarur Dekhe.
Kyunki Yeh Aapke Jaan Ka Mamla Hain !! pic.twitter.com/DydgI92we2