ప్రాణాపాయంలో వ్యక్తి: రైలును తోసిన ప్రయాణీకులు

Published : Feb 10, 2024, 10:14 AM ISTUpdated : Feb 10, 2024, 10:27 AM IST
 ప్రాణాపాయంలో వ్యక్తి: రైలును తోసిన ప్రయాణీకులు

సారాంశం

రైలు ఎక్కే సమయంలోనూ, దిగే సమయంలోనూ ఏమరుపాటుగా ఉంటే  ప్రమాదాలు జరుగుతాయి.  ఇదే తరహా ప్రమాదం ఒకటి  ముంబైలో చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: రైలుకింద పడిన ప్రయాణీకుడిని కాపాడేందుకు  తోటి ప్రయాణీకులు  రైలును తోశారు.  ముంబైలోని  వాషి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడిట్  సోషల్ మీడియా వినియోగదారుడు ఈ విషయాన్ని  ధృవీకరించారు.  ఇదే రైలులో తాను ప్రయాణీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ దృశ్యం చూడడానికి  చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం  అందరూ ఐక్యంగా నిలిచారన్నారు. మానవత్వం ఇంకా ఉందని చెప్పడానికి ఈ దృశ్యం నిదర్శనమని మరొకరు వ్యాఖ్యానించారు. కదులుతున్న రైలు నుండి దూకిన ప్రయాణీకుడిదే బాధ్యత అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో  ఏమరుపాటుగా ఉంటే  ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.  ముంబైలోని పలు రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఈ తరహా ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.

 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్