పార్లమెంటు సమావేశాల చివరి రోజు.. లోక్‌సభలో రామమందిర ప్రతిష్ఠాపనపై చర్చ...

By SumaBala Bukka  |  First Published Feb 10, 2024, 11:24 AM IST

17వ లోక్‌సభ చివరి రోజున, సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న సమయంలో.. రామాలయం అంశంపై లోక్‌సభలో చర్చ చేయాలన్న నిర్ణయం ద్వారా.. బిజెపి రామాలయం చుట్టూ ఉన్న రాజకీయ అంశాన్ని మరింత పొడిగించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరి రోజైన ఫిబ్రవరి 10వ తేదీ శనివారం అయోధ్యలో రామమందిర నిర్మాణంపై లోక్‌సభలో చర్చ జరగనుంది.

లోక్‌సభ సెక్రటేరియట్ బులెటిన్ ప్రకారం, రామాలయ నిర్మాణం, రాంలాలా ప్రాణ ప్రతిష్ఠపై చర్చను బిజెపి సీనియర్ నాయకుడు సత్యపాల్ సింగ్ ప్రారంభిస్తారు. శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే కూడా ఈ అంశంపై చర్చకు నోటీసు ఇచ్చారు. 17వ లోక్‌సభలో చివరిదైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమై శనివారంతో ముగుస్తాయి.

Latest Videos

undefined

అయోధ్యలోని రామ మందిరం, ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరి 22న ప్రధానమంత్రి చేతుల మీదుగా జరిగింది. భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లకు చెందిన కార్యక్రమం అని, ప్రతిపక్షాలు ఈ కార్యక్రమాన్ని"రాజకీయ" ప్రయోజనాల కార్యక్రమం అని చెబుతూ బహిష్కరించాయి. మోడీ ప్రభుత్వాన్ని విమర్శించినవారు దీనిని భారతదేశ లౌకిక, ప్రజాస్వామ్య పునాదులపై "దాడి"గా అభివర్ణించారు.

click me!