బెంగళూరులో మిస్టరీగా మారిన మరో పేలుడు శబ్దం.. !!

By AN TeluguFirst Published Nov 26, 2021, 4:17 PM IST
Highlights

బెంగళూరులో మరో పేలుడు శబ్దం ప్రకంపనలు సృష్టిస్తోంది. పట్టణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ మాత్రం ఎలాంటి పేలుడు జరగలేదని ఈ వార్తలను ఖండించింది. కర్నాటక రాష్ట్ర ప్రకృతి విపత్తు పర్యవేక్షణ కేంద్రం, లేదా KSNDMCలు ఈ మేరకు తమ డేటాలో పేలుడు లాంటి ఎలాంటి శబ్దం గుర్తించలేదని చెప్పారు.

బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరుకు 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణంలో ఈరోజు ఉదయం పేలుడు శబ్దం లాంటి పెద్ద శబ్దం వినిపించింది. అనేక క్వారీ వ్యాపారాలకు నిలయమైన బిడాడి నుండి ఈ శబ్దం వినిపించింది.

అయితే, పట్టణంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ మాత్రం ఎలాంటి పేలుడు జరగలేదని ఈ వార్తలను ఖండించింది. కర్నాటక రాష్ట్ర Natural Disaster Monitoring Centre, లేదా KSNDMCలు ఈ మేరకు తమ డేటాలో పేలుడు లాంటి ఎలాంటి శబ్దం గుర్తించలేదని చెప్పారు.

"చెప్పబడిన కాలంలో ఏవైనా భూప్రకంపనలు లేదా సాధ్యమైన భూకంప సంకేతాల కోసం మా భూకంప అబ్జర్వేటరీల నుండి డేటా విశ్లేషించబడింది. సీస్మోగ్రాఫ్‌లు స్థానిక ప్రకంపనలు లేదా భూకంపం signaturesను చూపించలేదు" అని KSNDMC ఒక ప్రెస్ నోట్‌లో తెలిపింది.

బెంగుళూరులో జూలై 2న కూడా ఇదే విధమైన ధ్వని వినిపించింది, అయితే ఇది సోనిక్ బూమ్ అని.. ధ్వని వేగం కంటే వేగంగా వెళ్లే జెట్ విమానం వల్ల ఈ శబ్దం వచ్చిందని నమ్మారు. బెంగళూరుకు చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, లేదా HALలు ఈ ప్రాంతంలో మామూలుగా విమానాలను పరీక్షిస్తుంటుంది. ఇక భారత వైమానిక దళం కూడా సోనిక్ బూమ్ అని చాలా మంది అనుమానించిన దానిలో ఎటువంటి పాత్ర లేదని తిరస్కరించింది.

Mizoram Earthquake: మిజోరాంలో భూకంపం, కోల్ కతాలో సైతం ప్రకంపనలు

ఇదిలా ఉండగా, భారత ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో ఈ రోజు ఉదయం భూకంపం సభవించింది. శుక్రవారం తెల్లవారు జామున 5.15 గంటలకు మిజోరాంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ మీద Eartquake తీవ్రత 6.1గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ సీస్మోలజీ (ఎన్ సీఎస్) తెలియజేసింది. థెంజాల్ కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని ఎన్ సీఎస్ తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన ఆస్తి, ప్రాణ నష్టం గురించి తెలియరాలేదు. 

భారత్ - మయన్మార్ సరిహద్దులో భూమి కంపించిందని యూరోపియన్ - మెడిటేరియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. శుక్రవారం తెల్లవారు జామున త్రిపుర, మణిపూర్, Mizoram, అసోంలతో పాటు కోల్ కతాలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదైందని తెలిపింది. 

భూకంప కేంద్రం బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ కు 183 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపింది. తెల్లవారు జామున 5.53 గంటలకు మరోసారి భూకంపం సభవించింది. ఇంత దీర్ఘమైన భూకంపం ఇంతకు ముందు తాము చూడలేదని స్థానికులు అంటున్నారు. 

click me!