పితృస్వామ్యం, సోదరుల దురాశ.. ఖురాన్ చెబుతున్నా వారసత్వ ఆస్తికి నోచుకోని ముస్లిం మహిళలు

Published : May 09, 2023, 02:07 PM ISTUpdated : May 09, 2023, 02:09 PM IST
పితృస్వామ్యం, సోదరుల దురాశ.. ఖురాన్ చెబుతున్నా వారసత్వ ఆస్తికి నోచుకోని ముస్లిం మహిళలు

సారాంశం

పితృస్వామ్య వ్యవస్థలో వారసత్వ ఆస్తి గురించి మహిళలు అడగడానికి ముందుకు రావడం లేదు. వారికి సంక్రమించిన హక్కులనూ వారు అడగడం లేదు. ముస్లిం మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా దక్కకపోవడానికి సోదరుల దురాశ కూడా ప్రధాన కారణం. పవిత్ర ఖురాన్ చెబుతున్నా.. పురుషులు ఆ ఆదేశాలను పాటించడం లేదు.  

పవిత్ర ఖురాన్ ప్రకారం వారసత్వ ఆస్తిలో కూతుళ్లు, సోదరీమణులకూ వాటా ఉంటుంది.  తండ్రి ఆస్తిలో మూడింట ఒకటో వంతు ఆస్తిని బిడ్డలకు ఇవ్వాలని ఆదేశిస్తున్నది. పవిత్ర గ్రంథమే చెబుతున్నా.. అక్కా చెళ్లెల్లు ఈ ఆస్తిలో వాటా దక్కకుండా సోదరులు చేస్తున్న ఉదంతాలు కోకొల్లలు.

మన సమాజంలో వారసత్వ సంపదలో వాటా అడగడంలో మహిళలు అనూహ్యంగా మౌనం వహిస్తారు. ఆకలితో అలమటించైనా తండ్రి ఆస్తిలో భాగం కావాలని సోదరులతో పోరాడదు. సాధారణంగా ఈ ఆస్తి హక్కును మహిళలు స్వచ్ఛందం, లేదా బలవంతంగానైనా వదులుకుంటూ ఉంటారు. చాలా వరకు కుటుంబాల్లో ఆస్తి పంపకాలు ఆడ పిల్లలకు తెలియకుండానే కొడుకులు భాగం చేసుకుంటారు. ఆస్తిపై హక్కు తమకే ఉన్నదని  కొడుకులు అనుకుంటారు. తమ అక్కా చెళ్లెల్లు వారి భర్త కుటుంబానికి చెందినవారని నమ్ముతారు. ఒక వేళ ఆ ఆడబిడ్డ వాటా అడిగితే.. ఆ వాటాను పెళ్లి ఖర్చులకు, వరకట్నం ఇవ్వడానికే అయిపోయాయని అడ్డంగా వాదిస్తారు. వారి చదువులకు పెట్టిన డబ్బులనూ కొందరు దురాశపరులు లెక్కపెడుతుంటారు. ఒక్కోసారి ఆ సోదరి భర్త, పిల్లలతో కలిసి ఇంటికి వచ్చినా ఖర్చులను లెక్కచెప్పి డబ్బులు చెట్లకు రాలవని వాదనకు పోతుంటారు.

మన సమాజంలో ఆడ పిల్లలకు తల్లి కుటుంబంతో భావోద్వేగపూరితమైన సంబంధం ఉంటుంది. ఆ సంబంధాన్ని కొనసాగించడానికి కొన్నిసార్లు స్వచ్ఛందంగా ఆస్తి హక్కును వదిలిపెట్టుకుంటారు. తల్లిదండ్రులు, సోదరులతో అనుబంధాన్ని కొనసాగించాలని ఆస్తి గురించి అసలు మాట్లాడనే మాట్లాడదు.

అయితే, ఆడ పిల్లలు పేద కుటుంబాల్లో పడినప్పుడూ, రోజువారీ ఖర్చులకూ డబ్బులు లేని పరిస్థితుల్లోనూ వారు ఆస్తి హక్కును అడగరు. ఒక వేళ అడిగినా.. సోదరులు ఇవ్వడానికి సిద్ధపడరు. తల్లి కుటుంబంలో గొప్పగా బతికి పేద కుటుంబానికి కోడలుగా వెళ్లి అక్కడ దినసరి కూలీగా మారినా సోదరులు వారికి చెందాల్సిన ఆస్తిని ఇవ్వడానికీ ముందుకురారు.

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లోని ఓ ఉదాహరణ ఇక్కడ ప్రస్తావిస్తా..

జెబున్నీసా (పేరు మార్చాం)కు 13 ఏళ్ల కూతురు ఉన్నది. అద్దెంటిలో ఉంటూ భర్తతో పాటు ఆమె కూడా నోయిడాలోని ఓ ఫ్యాక్టరీలో పనికి వెళ్లుతుంది. బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడానికి బంధువుల ఇంటిలో వదిలారు. నెలవారీగా కొంత డబ్బు వారికి ఇస్తున్నారు. బిడ్డకు దూరంగా ఉండి పనికి వెళ్లడం ఆమెకు ఇష్టం లేకపోయినా ఆర్థిక పరిస్థితులు బాగాలేక తప్పడం లేదని ఆమె వాపోయింది.

ఈద్‌కు తాను బిడ్డ వద్దకు వెళ్లినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పింది. అందరు కొత్త బట్టలు వేసుకుంటే తన బిడ్డ పాత దుస్తుల్లోనే ఉన్నదని, అందరు పిల్లలు ఆడుతుంటే తన బిడ్డ ఇంటి పనులు చేస్తున్నదని ఆమె వివరించింది. అయినా.. నిస్సహాయతతో దు:ఖించాను తప్పితే ఆమెను వెంట తీసుకురాలేకపోయానని బాధపడ్డది.

Also Read: Shraddha Walkar: శ్రద్ధా వాకర్‌ను నేను చంపలేదు.. విచారణకు సిద్ధం: అఫ్తాబ్ పూనావాలా

అయితే.. తన తండ్రి ఆస్తిలో తనకు దక్కాల్సిన వాటా వస్తే.. తమ జీవితాలు మారేవని జెబున్నీసా అనుకుంది. తనతోపాటు తన అక్కాచెళ్లెల్లు కూడా ఆస్తిలో వాటా కోసం సోదరులను అడుగుతున్నట్టు చెప్పింది. తొలుత సోదరులు మౌనం దాల్చినా తర్వాత వారికి ఏ ఆస్తి రాదనీ తెగేసి చెప్పారు. దీంతో జెబున్నీసా కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. జెబున్నీసా అక్కాచెళ్లుల్లకూ ఇలాంటి ఆర్థిక కష్టాలే ఉన్నాయి.

జెబున్నీసా సిస్టర్ షాజియాకు కూడా ఒకే కూతురు ఉన్నది. తనకు ఇతర ఆర్థిక వనరులు ఉంటే ఈ ఆస్తిని అడగేదాన్ని కాదని చెప్పింది. తండ్రి ఆస్తిలో వాటా వస్తే తన బిడ్డకు మంచి చదువులు చెప్పిస్తానని అన్నది. 

మూడో చెల్లె నగ్మ కూడా భర్తతో కలిసి కూలి పని చేస్తున్నది. తన సోదరుడు సంపన్నుడని, తనకు వాటా ఇస్తే ఒక బొటిక్ పెట్టుకుంటానని చెప్పింది. షబ్నం భర్త బీడీ ఫ్యాక్టరీలో పని చేస్తాడు. ఆ అల్లా మాకు తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వాలని చెప్పాడని, దాన్నే మేం అడుగుతున్నామని వివరించాడు.

తమ సోదరుడికి ఇప్పుడు వారసత్వంగా వచ్చిన రెండు బంగ్లాలు, తోటలు ఉన్నాయని, వాటి ద్వారా ఆదాయం వస్తున్నదని వివరించింది. తన సోదరుడితో సంబంధాలు తెగినా తాను ఖాతరు చేయబోనని, తనకు ఆస్తిలో వాటా కావాల్సిందేనని స్పష్టం చేసింది. తమ జీవితాలు ఇలా మగ్గుతున్నా పట్టించుకోకుండా సంపదతో తులతూగుతున్న సోదరుడితో సంబంధం ఉంటేనేం? ఊడితేనేం? అని చెప్పింది.

ఈ నలుగురు అక్కాచెళ్లెల్ల హక్కును ఎలా కాలరాసేశారనే ఆందోళనపూర్వక అనుమానం వస్తుంది. అయితే, తమ హక్కును, వాటాను దక్కించుకోవడానికి వారు కోర్టును ఆశ్రయించవచ్చని హర్యానాలోని కర్నాల్‌కు చెందిన న్యాయవాది మొహమ్మద్ రఫీఖ్ చౌహాన్ తెలిపారు. ఇండియన్ సెక్సెషన్ యాక్ట్ 1925 కింద వారికి హక్కు ఉంటుందని వివరించింది.

 

(---ఫిర్దౌస్ ఖాన్)

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్