
Surya Namaskar: పాఠశాలల్లో సూర్య నమస్కారం చేయించడాన్ని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు నమస్కారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్క్యులర్ జారీ చేసింది.
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా 30,000 పాఠశాలల్లో సూర్య నమస్కారాన్ని నిర్వహించాలని, జనవరి 1నుంచి స్కూల్స్ లో ఇది నిర్వహించాలని, జనవరి 26నుంచి మ్యూజికల్ ప్రోగ్రాం కూడా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సర్క్యులర్‌లో ఆదేశించారని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధమని ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల్లో సూర్య నమస్కారాలు నిర్వహించడం సరికారదనీ పేర్కొన్నారు. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కులకు విరుద్ధమని, ముస్లిం విద్యార్థులు ఇందులో పాల్గొనవద్దని కోరారు.
Read Also: Omicron Cases in AP: ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. తాజాగా 7 కేసులు
ఇది తప్పుడు దేశభక్తి అని ఆరోపించింది, అయినా ముస్లీంలు విగ్రహారాధనను విశ్వసించరని స్ఫష్టం చేసింది. లౌకిక దేశంలో ఇలాంటి చర్యలను సరికాదనీ, ముస్లీంలతో పాటు ఇతర మతాల వారు ఈ చర్యను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ముస్లీం పిల్లల ఇష్టం లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని బలవంతం చేయకూడదని స్పష్టం చేశారు.ఇది కచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను తొలగించడం వంటిదే’ అని అన్నారు.
Read Also: Srikakulam Earthquake : శ్రీకాకుళంలో భూప్రకంపనాలు.. వీధుల్లోకి జనాలు పరుగులు
సూర్యనమస్కారం అనేది రాజ్యాంగంలో పేర్కొన్న అంశం కాదు. ఇది తప్పుడు దేశభక్తిని సూచిస్తుంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకుని సెక్యూలర్ భావాలను దేశంలో సజీవంగా ఉంచాలని’ కోరారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య 01 జనవరి 2022 నుండి 07 ఫిబ్రవరి 2022 వరకు 750 మిలియన్ల సూర్య నమస్కార ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. సూర్య నమస్కారంలో సంగీత ప్రదర్శన కూడా 26 జనవరి 2022న ప్లాన్ చేయబడింది.