
Maoist Attack : జార్ఖండ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గురుచరణ్ నాయక్‌పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటన పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మంగళవారం మనోహర్‌పూర్ లో జరిగింది. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత గురుచరణ్ నాయక్‌ను టార్గెట్‌గా చేసుకొని మావోయిస్టులు దాడి కి పాల్పడ్డారు. అయితే.. ఈ దాడిలో గురుచరణ్ నాయక్ తృటిలో తప్పించుకోగా, ఇద్దరు గన్ మెన్ల గొంతు కోసి అక్కడ నుంచి పారిపోయారు.
చక్రధర్‌పూర్ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దిలీప్ ఖల్ఖో తెలిపిన వివరాల ప్రకారం.. గోయిల్‌కెరా పోలీస్ స్టేషన్ పరిధిలోని జినారువాన్ గ్రామంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ కి చీఫ్ గెస్ట్ గా గురుచరణ్ నాయక్ హాజరయ్యారు. గురుచరణ్ నాయక్ వస్తాడన్న సమాచారం ముందుగానే తెలుసుకున్న మావోయిస్టులు గ్రామంలోకి ప్రవేశించారు.
Read Also :Omicron Cases in AP: ఏపీలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు.. తాజాగా 7 కేసులు
ప్లాన్ ప్రకారం.. ఫుట్ బాల్ మ్యాచ్ కు ప్రేక్షకుల వచ్చారు. మ్యాచ్ జరుగుతోన్న సమయంలో ప్రేక్షకులలోంచి గురుచరణ్ నాయక్ పై ఫైరింగ్ చేశారు. దీంతో అప్రమత్తమైన ఆయన గన్ మేన్స్ దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. దీంతో మావోయిస్టుల దాడి నుండి తృటిలో తప్పించుకున్నారు.
Read Also : Srikakulam Earthquake : శ్రీకాకుళంలో భూప్రకంపనాలు.. వీధుల్లోకి జనాలు పరుగులు
అయితే మావోయిస్టుల కాల్పుల్లో ఘటన స్థలిలోనే ఓ గన్ మెన్ మృతి చెందగా మరో గన్ మెన్ ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లి అడివిలో హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో మావోయిస్టులు ఏకె 47, రెండు ఇన్సాస్ రైఫిల్స్‌ను లాక్కెళ్లారని జార్ఖండ్ పోలీస్ డైరెక్టర్ జనరల్ నీరజ్ సిన్హా చెప్పారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వేట కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. 2012లో ఆనంద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు చేసిన దాడిలో నాయక్ తృటిలో తప్పించుకున్నాడు.