
1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో (1971 india pakistan war) పాల్గొన్న రిటైర్డ్ వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ (vice admiral sh sarma) సోమవారం కన్నుమూశారు. ఒడిశా (odisha) రాష్ట్రంలో భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం 6.20 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఎస్‌హెచ్ శర్మకు 100 ఏళ్లు నిండాయని… వయసు సంబంధిత అనారోగ్యానికి చికిత్స పొందుతూ మరణించారని శర్మ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన మరణం పట్ల ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (naveen patnaik) , మంత్రులు, త్రివిధ దళాల్లోని అధికారులు సంతాపం తెలిపారు.
ఎస్‌హెచ్ శర్మ 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో తూర్పు నౌకాదళానికి ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆనాటి యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ యుద్ధం అనంతరం బంగ్లాదేశ్ అనే సరికొత్త దేశం ప్రపంచ పటంలో రూపుదిద్దుకుంది. వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ తూర్పు నౌకాదళ కమాండ్ (indian navy eastern command) .. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా కూడా పనిచేశారని ఇండియన్ నేవి తెలిపింది.
వైస్ అడ్మిరల్ ఎస్‌హెచ్ శర్మ గతేడాది 2021 డిసెంబర్ 1వ తేదీన తన 100వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆజాదీ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో కూడా పాల్గొన్నారు. 1971లో భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం జరిగింది. ఈ వార్ జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. 50 ఏళ్ల క్రితం.. 1971 , 16 డిసెంబర్ సాయంత్రం 4.35 గంటల.. , పాకిస్తాన్ సైన్యం భారత్ తూర్పు కమాండ్ కి లొంగిపోయింది. రెండు దేశాల మధ్య 13 రోజులపాటు జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ .. తూర్పు సెక్టార్‌లోనే కాకుండా పశ్చిమ సెక్టార్‌లోనూ ఓడిపోయింది.