క్షుద్రపూజల పేరుతో సొంత చెల్లెలి హత్య.. పేగులు తీసి, ముక్కలుగా నరికి దహనం..!!

Published : Jun 28, 2022, 08:02 AM IST
క్షుద్రపూజల పేరుతో సొంత చెల్లెలి హత్య.. పేగులు తీసి, ముక్కలుగా నరికి దహనం..!!

సారాంశం

క్షుద్రపూజల పేరుతో ఓ మహిళ తన సొంత సోదరినే దారుణంగా హతమార్చింది. ఊహించానికి కూడా వీలులేని విధంగా ఆమె మృతదేహాన్ని చిత్రహింసలకు గురిచేసి.. దహనం చేసింది. 

ఝార్ఖండ్ :  మానవత్వం మంటగలిసే.. వింటేనే కడుపులో దేవేసే హృదయ విదారక ఘటన jharkhandలోని గఢ్వా జిల్లాలో చోటు చేసుకుంది. క్షుద్ర పూజల పేరుతో ఓ మహిళ సొంత సోదరినే హత్య చేసింది. ఆ తరువాత ఊహించని విధంగా ఆ మృతదేహంతో ప్రవర్తించింది. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వివరాల్లోకి వెడితే.. 

నగర్ ఉంటరి పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేలి గ్రామంలో లలితా దేవి తన భర్త దినేష్ ఓరన్ తో కలిసి జీవిస్తుంది. వీరిద్దరూ కలిసి ఓరన్  తోలాలోని రాంశరన్ నివాసానికి  క్షుద్ర పూజలు చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన లలితాదేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది. గుడియా దేవి వచ్చిన వెంటనే లలితా దేవి మంత్రాలు చదవడం ప్రారంభించింది. ఆమె భర్త  గుడియాను కర్రతో కొట్టాడు. దీంతో తీవ్ర రక్తస్రావం పడిపోయిన ఆమెను.. లలిత, ఆమె భర్త కలిసి  ముక్కలు ముక్కలుగా నరికారు. ఆ తర్వాత ఆమె నాలుక కత్తిరించారు.

అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో చేతులు పెట్టి పేగులు బయటకు తీశారు. ఇంత దారుణానికి పాల్పడుతున్నాఅక్కడే ఉన్న gudiya భర్త కానీ, మిగతా బంధువులు కానీ ప్రేక్షకులలాగా చూస్తూ ఉండిపోయారు. ఆ తరువాత ఆమె మృతదేహాన్ని అడవి మధ్యలోకి తీసుకువెళ్లి దహనం చేశారు. ఈ విషయాన్ని గుడియా భర్త  మున్నా.. గ్రామ పెద్దలకు తెలియజేశాడు. దీంతో పంచాయతీ పెట్టగా.. వార్డు కౌన్సిలర్ భర్త దీనిని కప్పిపుచ్చేందుకు  ప్రయత్నించాడు. ఆ తరువాత విషయం బయటకు రావడంతో పోలీసులకు సమాచారం అందింది.  మరోవైపు, మున్నా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేష్ ఓరన్, రాంశరన్ ఓరన్,  లలితాదేవి ఐదుగురిని అరెస్టు చేశారు. 

నోట్లో కుంకుమపోయడంతో మరణించిన పునర్విక కేసులో.. వెలుగులోకి కొత్త విషయాలు.. నాన్నమ్మ అక్కడే ఉన్నా..

ఇలాంటి దారుణ ఘటనే, జూన్ 16న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో జరిగింది. తమ కుటుంబానికి ఏదో చెడు చుట్టుకుంటుందని... అది పోవాలంటే పూజలు చేయాలి.. అనుకున్న ఓ తండ్రి.. తన కన్న కూతురి ఒంటిపై పసుపు నీళ్ళు పోసి, నోటి నిండా కుంకుమ పోసి ఊపిరాడకుండా చేశాడు. దాంతో ఆ బాలిక మరణించింది. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని వీరారెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. ప్రొక్లెయిన్ నిర్వహణతో నష్టపోయిన వేణుగోపాల్.. జూన్15న తన  కవల కుమార్తె ల్లో ఒకరైన Punarvika (3)ను  పూజగదిలో పడుకో బెట్టి,  పసుపు నీళ్లు పోశాడు. 

తర్వాత నోట్లో కుంకుమ, పసుపు పోసి మింగమని బలవంత పెట్టాడు. అయితే ఆ పసుపు, కుంకుమలతో ఊపిరి ఆడకపోవడంతో..  బాలిక కేకలు వేసింది. ఆ కేకలు విన్న చుట్టుపక్కల వాళ్ల వచ్చి  వెంటనే ఆస్పత్రికి  ఆ చిన్నారిని.. మొదట ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి చెన్నైకి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పాప మృతి చెందింది. 

PREV
click me!

Recommended Stories

Indian Railways: ట్రైన్‌లో లగేజ్ పోతే రైల్వేనే డబ్బులిస్తుందా? ఈ షాకింగ్ రూల్ మీకు తెలుసా !
అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours