Nitin Gadkari: ఎనిమిది సీట్ల వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి: నితిన్ గడ్కరీ

By Rajesh KFirst Published Jun 28, 2022, 6:05 AM IST
Highlights

Nitin Gadkari: ఎనిమిది సీట్ల వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
 

Nitin Gadkari: ప్రయాణికుల భద్రతను మరింతగా మెరుగుపరిచేందుకు కేంద్రం మ‌రోకీల‌క నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఎనిమిది మంది ప్రయాణించగలిగే వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను  తప్పనిసరి చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. కార్ల తయారీదారులు  తప్పనిసరిగా నియ‌మాన్ని పాటించాల‌ని మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. 

 ఇంటెల్ ఇండియా సేఫ్టీ పయనీర్స్ కాన్ఫరెన్స్- 2022తో పాల్గొన్న మంత్రి గడ్కరీ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం ఐదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది మరణిస్తున్నారని అన్నారు. అక్టోబరు నుంచి తయారయ్యే ఎం1 కేటగిరీ వాహనాల్లో త‌యారీదారు త‌ప్ప‌ని స‌రిగా.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమ‌ర్చాల‌ని, ప్ర‌భుత్వం నిర్ణయించిందని,  ప్రాణాలను రక్షించాలనుకుంటున్నామని మంత్రి చెప్పారు. 
ఈ మేర‌కు ముసాయిదా నోటిఫికేషన్‌ను గత జనవరిలో జారీ చేసిన‌ట్టు తెలిపారు.

రోడ్డు భద్రత మ‌రింత మెరుగుప‌ర‌చ‌డానికి  సురక్షితమైన వాహనాలు, సురక్షితమైన రోడ్లు, సురక్షితమైన డ్రైవర్లు అవ‌స‌ర‌మ‌ని అన్నారు. నేడు భారతదేశంలో రోడ్డు ప్ర‌మాదాలు పెద్ద సమస్య మారింద‌నీ,  ప్రతి సంవత్సరం 5 లక్షల ప్రమాదాలు జరుగుతాయనీ,  వీటిలో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో దాదాపు  3 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. భారతదేశంలో ప్రతి గంటకు దాదాపు 400 మంది ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు, ఇది చాలా ఆందోళన కలిగించే విషయమ‌ని అన్నారు. 

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భారతదేశంలో ప్రమాదవశాత్తు మరణాల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి తగ్గించాలి, 2030 నాటికి ఈ సంఖ్యను సున్నాకి తీసుకురావాలని అన్నారు. ఇది కష్టమైన పని, కానీ అసాధ్యం కాదని, ఇది మ‌నందరి కృషితో సాధ్య‌మ‌వుతుందని అన్నారు.  కృత్రిమ మేధస్సు ఇక్కడ చాలా ముఖ్యమైనదనీ, ఇప్పటికే ఉన్న నూత‌న టెక్నాల‌జీ ప్రజల జీవితాలను రక్షించడంలో చాలా ప్రభావవంతంగా ఉన్నాయని, ఇప్ప‌టికే పలుసార్లు రుజువు అయ్యింద‌నిఅన్నారు. రహదారి భద్రతను పెంచడానికి, ఆటోమొబైల్ కంపెనీల సహకారంతో 3-రోజుల కోర్సును నిర్వహించాలి, అక్కడ వారు డ్రైవింగ్ నేర్పించి, 3-రోజుల తరువాత‌ సర్టిఫికేట్ ఇవ్వాలని అన్నారు."

భారతదేశంలో రహదారి భద్రతను పెంపొందించే లక్ష్యాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికతను ఉపయోగించాలనే లక్ష్యాన్ని ఇన్ టెల్ బలోపేతం చేసింది. రోడ్డు భద్రతకు సహకరించడానికి, ప్రోత్సహించడానికి ఇంటెల్ సాంకేతిక, రవాణా ప్రొవైడర్లు, వాహన తయారీదారులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థల వంటి ప్రముఖ సంస్థలను ఒకచోట చేర్చింది. సమస్యల పరిష్కారానికి అవకాశం ఇచ్చింది.

రహదారి భద్రతను బలోపేతం చేస్తూ.. కంపెనీ వాణిజ్య వాహనాల కోసం AI-ఆధారిత ఫ్లీట్ సేఫ్టీ సొల్యూషన్ అయిన ఇంటెల్ ఆన్‌బోర్డ్ ఫ్లీట్ సర్వీసెస్ ("సొల్యూషన్")ను ప్రదర్శించింది. ఈ సమగ్ర పరిష్కారం.. ప్రపంచ స్థాయి, రహదారి పరీక్షించిన సాంకేతికతను అందిస్తుంది, ఇది భారతీయ పరిస్థితుల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది. ఇది కొలిషన్ అవాయిడెన్స్ సిస్టమ్ (CAS), డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, ఫ్లీట్ టెలిమాటిక్స్, ఫ్లీట్ హెల్త్,  ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఫీచర్లను క‌లిగి ఉంటుంది. 

హజ్మత్, గోల్డ్ చైన్, థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3PL), ఎంప్లాయీ ట్రాన్స్‌పోర్ట్ వంటి రంగాల్లో ష్యూర్ గ్రూప్ లాజిస్టిక్స్, సాంక్ ఇండియా లాజిస్టిక్స్, అలనెన్స్ వంటి 16 మంది క్లయింట్లు ఈ సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికత వ‌ల్ల ప్రమాదాలు జ‌రిగే అవకాశాలను 40 నుండి 60 శాతం వరకు తగ్గించవ‌చ్చు. ప్ర‌మాద‌నష్టాన్ని 50 శాతం వరకు తగ్గించవచ్చు.

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల రేటు ప్రపంచంలోనే అత్యధికం. మ‌న‌దేశంలో 11 శాతం మ‌ర‌ణాలు రోడ్డు ప్రమాదాల్లో సంభ‌విస్తున్నాయి. భారత్‌లో రోజుప్ర‌మాదాల్లో మ‌ర‌ణించిన వారి సంఖ్య లక్షాయాభైవేలు దాటడం ఆందోళన కలిగించే అంశం. క్షతగాత్రుల సంఖ్య దానికి నాలుగింతలు ఉంటుంది. దేశంలో ప్రతిరోజూ సగటున రోడ్డు ప్రమాదాలలో 400 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు రేపటి పౌరులే ఉంటున్నారు. రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో 54 శాతం యువతేనని, ప్రమా దాల వల్ల 48,000 కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ప్రభుత్వమే చెబుతోంది. 

click me!